Thursday, March 5, 2009

సెలవు

వ్యగ్తిగత పనుల వల్ల నేను మార్చిలో టపాలు రాయలేకపోతున్నాను. మరిన్ని టపాలతో పునర్దర్శనం ఏప్రిల్ లోనే. అంతవరకూ సెలవు.

Friday, February 20, 2009

మహమ్మదు జీవితం: మక్కా మదీనా మధ్య గొడవలు

మహమ్మదు మదీనా వచ్చిన మొదటి ఆరు నెలలు ప్రశాంతంగానే గడిపాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ముస్లిములందరికీ తమ కుటుంబాలకు తగిన సౌకర్యాలు కలుగజేయడానికి సమయం సరిపోయింది. ఒక్కసారి మక్కా, మదీనాలలో అప్పట్లో జరిగే వ్యాపారం మనం గమనిద్దాం. ఎండాకాలం గడిచిన తరువాత మక్కా నుంచి యెమెన్, అబిస్సీనియాకు వ్యాపారులు గుంపులుగా వెళ్ళేవారు. అదే విధంగా చలికాలం గడిచిన తరువాత మక్కా నుంచి సిరియా వెళ్ళేవారు. వీరందరూ పర్షియా, సిరియా, గాజా, అబిస్సీనియా, యెమెన్ లాంటి దేశాలతో వ్యాపారం నిర్వహించేవారు. మద్యం, పట్టు, తోలు ఉత్పత్తులు, విలువైన రాళ్ళు ఇలా అనేకమైన వాటిని వ్యాపారం చేసేవారు. ఇవి బాగా లాభాలు గడించేవి. కాస్త అటూ ఇటూగా అయిదు లక్షల దీనార్లవరకూ వార్షిక టర్నోవర్ ఉండేది.

మహమ్మదుకు మదీనాలో అలా ఏడు నెలలు గడిచింది. అప్పటినుంచి మక్కాకు వెళ్ళే వ్యాపారగుంపులు (Caravan) మదీనాకు దగ్గరగా వెళ్ళాల్సివచ్చేది. చలికాలం ముగిసిన వెంటనే మహమ్మదు కారావానులను దాడి చేయమని తన అనుచరులయిన ముస్లిములకు చెప్పాడు. మొదటిసారి హమ్జా ఆధ్వర్యంలో ముప్పై మందిని ఒక కారావానుపై దాడి చేయమని పంపాడు. కానీ ఆ కారావానులో మూడు వందలకు పైగా ఉండేసరికి వాళ్ళు అందరూ ఒట్టి చేతులతో తిరిగివచ్చారు. (Pg: 198) తరువాత ఒబెయిదా ఆధ్వర్యంలో అరవై మందిని ఒక కారావానుపై దాడి చేయమని పంపాడు. కానీ ఈ సారి కారావానులో రెండువందల మంది ఉన్నారు. ఈ సారి కూడా ముస్లిములు దాడి చేయలేదు. కారావానులలో ఇద్దరు ముస్లిములు ఉన్నారు. వారు తమపై దాడి చేయడానికి వచ్చిన ముస్లిములను చూచి వారితో కలిసి పారి పోయారు. (Pg:199) ఒక నెల తరువాత మహమ్మదు సాద్ ఆధ్వర్యంలో ఇరవైమందిని దాడి చేయమని పంపాడు. వారు ఒక ప్రత్యేకమయిన చోటు వద్ద దాడిచేయాలని అనుకున్నారు, కానీ వారు ఆ చోటుకు చేరేసరికి ఆ కారావాను వెళ్ళిపోయింది. (Pg: 199) అదే సంవత్సరం ఎండాకాలంలోనూ, ఆ తరువాత మహమ్మదు ఇలా మూడుసార్లు దాడి చేయడానికి వెళ్ళాడు కానీ ఏమీ లాభం లేకపోయింది (Pg: 199-200). ఒకసారి మహమ్మదు ఇలా దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కుర్జ్ ఇబ్న్ జబీర్ అనే మరో అరబ్బు తెగకు చెందిన దోపిడీదొంగ మదీనాకు చెందిన అనేక ఒంటెలను, మేకలను తస్కరించాడు. మహమ్మదు అతనిని వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఒకసారి దాడికి అబ్దుల్లాహ్ ఇబ్న్ జాష్ను పంపాడు. అతనితోపాటు మరో ఏడుగురిని కూడా పంపాడు. వాళ్ళు నఖ్లా అనే ప్రదేశానికి వచ్చి రాబోయే కారావానుకోసం వేచి చూస్తున్నారు. వారు అక్కడికి వచ్చిన తరువాతి రోజు కారావాను అక్కడికి వచ్చింది. అందులో కేవలం నలుగురు మనుషులు మాత్రమే ఉన్నారు. అప్పటికి పవిత్రమాసాలు ముగియలేదు. ఆ రోజు చివరి రోజు. దాడికి వెళ్ళిన వారిలో ఒకడు తలను పూర్తిగా క్షవరం చేయించుకుని గుండుతో ఉన్నాడు. అతన్ని చూచి వారు దాడి చేయడానికి రాలేదని కారావానులో అందరూ అనుకున్నారు. వాళ్ళకు దగ్గరగా వెళ్ళినప్పుడు ముస్లిములు వారిలో ఇద్దరిని చంపి కొంత సొమ్ముతో పారిపోయారు. కానీ వాళ్ళందరికీ పవిత్రమాసంలో యుద్దం చేసామన్న అపరాధ భావం వారి మనస్సులలొ ఉండి పోయింది. ఆ రాత్రి వారు చెప్పినది విన్న మహమ్మదు వారిని ఊరడించాడు. అప్పుడు మహమ్మదుకు పవిత్రమాసంలో ముస్లిమేతరులను చంపడం కన్నా ఇస్లాముకు వ్యతిరేఖంగా ఉండడం పెద్దపాపమని సందేశం వచ్చింది (Pg: 201-203). ఆ దాడిలో వచ్చిన సొమ్మును ముస్లిములందరూ పంచుకొని ఆ సొమ్ములో అయిదోవంతు మహమ్మదుకు ఇచ్చారు (Pg:203). మక్కానుంచి మహమ్మదు మదీనాకు వచ్చి సంవత్సరమయ్యింది. మక్కావాసులకు సిరియాతో వ్యాపారం చాలా ముఖ్యం. అది వారికి ప్రాణవాయువు వంటిది. ఇప్పుడు మహమ్మదు వల్ల తమ వ్యాపారానికి ముప్పు వచ్చింది. తమ శత్రువు జీవితాలను కానీ పవిత్రమాసాలయొక్క పవిత్రతను చూచి కానీ ఆగేలా కనబడడం లేదు. కానీ మక్కావాసులు మహమ్మదు మీద దాడికి యోచన చేయలేదు. మహమ్మదు అనుచరులు (ముస్లిములు) అనేకులు మక్కాలోనే ఉన్నప్పటికీ వారిని ఇబ్బందులకు గురి చేయలేదు. కానీ మక్కావాసులకు మహమ్మదు/ముస్లిములకు మధ్య దూరం పెరిగిపోతున్నది (Pg: 203-204). ఈ సమయంలో మక్కావాసులపై, ముస్లిమేతరులపై పగ తీర్చుకోమని మహమ్మదుకు సందేశం వచ్చింది.

సురా: xxii, V 41 (Pg: 204)

సురా: ii, V 191 (Pg: 204)

(Pg: 204)

అప్పటినుంచి మతం ప్రాతిపదికన యుద్దం చేయవచ్చు అని ముస్లిములకు మహమ్మదు చెప్పాడు. శత్రుత్వాన్ని కాఫిర్లను (ముస్లిమేతరులు) తరిమివేయడం పేరిట మొదలుపెట్టారు. ఇలా చేయడంలో మహమ్మదు ముస్లిములకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసాడు – ఈ భూమి మొత్తం మీద ఇస్లాము తప్ప మరే మతం మిగలకూడదు అని. ఆ యుద్దంలో ఖచ్చితంగా ముస్లిములు గెలుస్తారని వారికి దైవం సాక్షిగా మహమ్మదు చెప్పాడు (Pg: 204-205). ఈ సమయంలో మక్కాలో చెప్పిన శాంతియుత సురాలన్నీ తప్పని ఒక సందేశం వచ్చింది. అంతేగాక యుద్దంలో చనిపోయిన ముస్లిములందరూ స్వర్గానికి వెళతారని మహమ్మదుకు మరో సందేశం వచ్చింది (Pg: 205)


అంతేగాక ముస్లిములందరూ యుద్దం చేయడం మాత్రమే కాకుండా యుద్దానికి ధనసహాయం కూడా చేయాలి. ఈ పన్నును “జాకత్” అని పిలుస్తారు. (ఈ పన్ను ఇప్పటికీ ముస్లిములు ఏదైనా ఒక ముస్లిము సంస్థకు దానం చేస్తారు.) (Pg 204-205)


ఇలా మహమ్మదు ముస్లిములందరినీ ముస్లిమేతరులపై యుద్దానికి సంసిద్దులను చేసాడు. మక్కావాసుల కారావానులపై దాడి బాగా లాభదాయకంగా ఉండడంతో మదీనావాసులలో ముస్లిమేతరులు కూడా దోపిడీ సొమ్ము మీదా ఆశతో మహమ్మదుతో పాటు వెళ్ళేవారు. ముస్లిమేతరులు ముస్లిములతో కలిస్తే వెంటనే మహమ్మదు వారిని ఆపి వారు ముస్లిములుగా మారితే తప్ప దాడికి రాకూడదని చెప్పేవాడు. దాంతో అప్పటికప్పుడు వారు తమ మతాన్ని మార్చుకొని ముస్లిములుగా మారేవారు. అలా మహమ్మదు అనేకులను ముసిములుగా మార్చగలిగాడు. అలా రెండు మూడు సంవత్సరాలలో మదీనా మొత్తం మహమ్మదు అధికారంలోకి వచ్చింది (Pg: 206).

వనరు: Life Of Mahomet, William Muir, Printed 1891.
(వచ్చేవారం బద్ర్ యుద్దం)

Monday, February 16, 2009

మహమ్మదు జీవితం: మదీనాలో ప్రవక్త

మహమ్మదు తన యాభైమూడవ సంవత్సరంలో అనగా 622AD నాడు మదీనాకు వలసవెళ్ళాడు. అందుకు గుర్తుగా ఆ సంవత్సరాన్ని హెజ్రా (1) సంవత్సరమని (Year of Hejira) పిలుస్తారు. ముస్లిముల సంవత్సరాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. వారు సంవత్సరాలను లెక్కవేసేటప్పుడు హెజ్రా నుంచి ఒకటవ సంవత్సరం, రెండవ సంవత్సరం…… అని పిలవడం మొదలుపెట్టారు. ముస్లిముల సంవత్సరాలు అందుకే 1000 AH, 1100AH అని ఉంటాయి. ఇది కాస్త వింతగానే అనిపించవచ్చు, ఎందుకంటే క్రైస్తవ సంవత్సరాలు క్రీస్తు పుట్టిన దగ్గర నుంచీ మొదలవుతాయి. కానీ ముస్లిముల సంవత్సరాలు మహమ్మదు పుట్టిన సంవత్సరం నుంచి, మహమ్మదు ప్రవక్త అని ప్రకటించిన సంవత్సరం నుంచి కాకుండా మదీనాకు వలస వెళ్ళిన దగ్గరనుంచీ మొదలవుతాయి.
మహమ్మదు అలా అబూ బక్ర్ తో ఎనిమిది రోజులు ప్రయాణించి మదీనా చేరుకున్నాడు. ముందు మదీనా వెళ్ళకుండా కోబా అనే చిన్న Suburbలో నాలుగు రోజులు ఉండి అప్పుడు మదీనాలో అడుగుపెట్టాడు. ఆ నాలుగు రోజులలో మహమ్మదు ఒక పెద్ద మసీదుకు పునాది వేసాడు. ఆ మసీదును “దేవుని ఎదుట భయం” అనే పేరుతో తరువాతి కాలంలో పిలిచేవారు. ఆ రోజు శుక్రవారం. అప్పుడు మహమ్మదు మదీనాలో అడుగుపెట్టాడు. అక్కడ ఒక పూజా ప్రదేశంలో ఆగి నమాజు చేసాడు. అప్పుడు మహమ్మదుతో పాటు దాదాపు వందమందికిపైగా ముస్లిములు ప్రార్థన చేసారు. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని యాత్రికులకు చూపిస్తారు. ఆ ప్రదేశాన్ని “Masjid al Juma” లేక “శుక్రవారపు మసీదు” అని పిలిచేవారు. ఇక అప్పటినుంచి ప్రతీ శుక్రవారం ముస్లిములకు పవిత్రమైన దినమని ప్రకటించారు. (pg: 163)

ప్రార్థనలు ముగిసాక మహమ్మదు మదీనాలో తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు మహమ్మదును చూడడానికి ప్రజలు విపరీతంగా ఎగబడ్డారు. మహమ్మదు మసీదు కట్టడంలో తన వంతు సాయం చేసాడు. రోజూ వెళ్ళి అందరితో పాటు తను కూడా పని చేసేవాడు. మహమ్మదు మసీదులో ఒక చోటు పేదలకు కేటాయించేవాడు. రోజూ తను తీసుకునే ఆహారంలో కొంచెం భాగం వారికి పంపేవాడు. అది చూచి మిగతా ముస్లిములు (డబ్బున్నవారు) కూడా అలాగే పంపేవారు. మహమ్మదుతో పాటు మక్కానుంచి వచ్చిన వాళ్ళను “ముహాజరీన్” ((Muhajarin) అనగా వలస వచ్చిన వాడు అని అర్థం) అని పిలిచేవాళ్ళు. వీరికి మదీనాలో సాయం చేసినవాళ్ళను “అన్సార్” (Ansar – Helpers or allies) అని పిలిచేవారు.

అలా మదీనాలో స్థిరపడిన మహమ్మదుకు తన మతంలోకి ప్రజలను మార్చుకోవడం ఎక్కువ కష్టం కాలేదు. చూస్తుండగానే మహమ్మదును ప్రవక్తగా గుర్తించే ప్రజలు విపరీతంగా పెరిగిపోయారు. మదీనాలో మారనివారు సైతం మహమ్మదును ప్రవక్తగా భావించారు. అలా మహమ్మదుకు మదీనాలో ఎదురనేదే లేకుండా పోయింది. మహమ్మదు మదీనాలోకి వచ్చిన తరువాత కొంతకాలానికి (స్పష్టమైన తేదీ ఇవ్వలేదు) యూదులతెగలతో ఒక ఒప్పందానికి వచ్చాడు. అందులో ముస్లిములకు మరియు యూదులకు సమాన హక్కులు ఇచ్చాడు. ఆ ఒప్పందాన్ని ఇక్కడ చూడవచ్చు. (పేజీ 177)

కానీ యూదులకు ముస్లిములకు మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక యూదుడు ముస్లిములతో కలవడం మొదలుపెడితే అతను కొంతకాలానికి మొత్తం తన మతాన్ని మార్చుకోవలసి వచ్చేది. యూదులు ఒకానొక సందర్భంలో తమ యొక్క ప్రవక్త ఖచ్చితంగా ఇష్మాయేలులలో ఒకడుగా పుడతాడుగానీ అరబ్బులలో ఒకడుగా పుట్టడని తేల్చిచెప్పారు(పేజీ 179). అంతేగాక అతను యూదులలో ఒకడుగా పుడతాడనీ డేవిడ్ వారసుడుగా వస్తాడనీ అన్నారు. అలా యూదులలో అత్యధికులు మహమ్మదును ప్రవక్తగా నిరాకరించారు. కానీ ముస్లిములుగా మారిన యూదులు మాత్రం మహమ్మదు నిజమైన ప్రవక్తయని నమ్మారని, వారికి అందుకు తగ్గ ఆధారాలు అన్నీ దొరికాయని మరియు ఇతర యూదులు తమ పూర్వీకులవలెనే (ఏసును నిరాకరించినవారు) నిజమైన ప్రవక్తను నమ్మలేదని ముస్లిము పుస్తకాలు మనకు చెబుతున్నాయి. ఆ కొద్ది మంది యూదులకు లభించిన ఆధారాలు ఏమిటనేది ముస్లిములు తమ పవిత్ర గ్రంథాలలో వివరించలేదు.

మొదట్లో ముస్లిములు రోజుకు అయిదు సార్లు జెరూసలేము వైపు తిరిగి ప్రార్థన చేయాల్సి ఉండేది. మహమ్మదు మదీనా వచ్చిన పదహారూ పదిహేడు నెలల తరువాత మక్కావైపు మార్చాలనుకున్నాడు. అందుకు తగ్గట్లుగా దైవదూత గేబ్రియేల్ ను అడిగాడు. అప్పుడు మహమ్మదుకు సందేశం ఇలా వచ్చింది.


(పేజీ 183). ఇక అప్పటినుంచి ముస్లిములు మక్కా వైపు తిరిగి తమ ప్రార్థనలు చేసేవారు. సుంతీ (పురుషాంగానికి కొంచెం కత్తిరించడం) గురించి ఖురానులో ఎక్కడా ఏమీ రాయలేదు. అది అప్పటి అరబ్బుల ఆచారం. ఆ ఆచారాన్నే ఇప్పటికీ ముస్లిములు కొనసాగిస్తున్నారు (పేజీ: 185). మదీనాకు వలస వచ్చిన తరువాత మహమ్మదు యూదులు కొన్ని రోజులు ఉపవాసం ఉండడం గమనించాడు. యూదులతో మంచి జోడు కుదిరిన రోజులలో ఈ ఆచారాన్ని ఇస్లాములో ప్రవేశపెట్టాడు. కానీ యూదులతో బంధం తెగినవెంటనే ఇది కూడా తెగిపోయింది. ఒకటిన్నర సంవత్సరాల తరువాత మహమ్మదుకు సందేశం వచ్చింది. దాని ప్రకారం అప్పటి నెలను (రంజాన్) ఉపవాసపు నెలగా భావించాలని మహమ్మదు ఆదేశించాడు. ఇది యూదుల ఆచారాలకు కాస్త విభిన్నంగా
ఉంటుంది. ఇలా మహమ్మదు మదీనాలో మొదటి రెండు సంవత్సరాలు గడిపాడు.

Source: William Muir's Life of Mahomet, Printed 1891.

Monday, February 9, 2009

మహమ్మదు జీవితం: మదీనాకు వలస

(క్రితంసారి నా వ్యాసాన్ని చూచి ఒక వ్యక్తి నేను సైతానునని తిట్టాడు. నాకు అతని మీద కోపం లేదు. ఇలా మీలో ఎంత మంది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు ఈ టపాలు వ్రాస్తున్నానో చెబుతాను. మనందరికీ మన మతాల గురించి బాగా తెలుసు. మన మతాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. వాటివల్ల మన సమాజాలు ఎలాంటి అధోగతిలో పయనించాయో కూడా తెలుసు. అదే విధంగా ముస్లిములు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. నేను అందుకు కారణం ఏమైఉంటుందా అని ఆలోచించి వారి మతాన్ని చదువుదామనుకున్నాను. అందుకు ముందుగా నేను వారి ప్రవక్త అయినటువంటి మహమ్మదు యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని తరువాత ఖురాను, మరియు ఇతర ముస్లిము పవిత్ర గ్రంథాలను చదివాను. వాటిలో నుంచి కొన్ని విషయాలను నేను వ్రాస్తున్నాను. నేను వ్రాస్తున్నవి కొన్ని ఇబ్బందికరమైన విషయాలని నాకు తెలుసు. అందుకు నేను పాఠకుడు కూడా వివరంగా నా టపాలలో నిజమెంతున్నది అని సులభంగా తెలుసుకోవడానికి నేను William Muir గారి పుస్తకంలో నుంచి వ్రాస్తున్నాను. నేను వ్రాసిన టపాలలో ఎక్కడయినా తప్పులు కనబడితే నాకు తెలిపిన నేను దానిని సరిదిద్దుకోగలను. నేను ముస్లిముల గురించి వ్రాయడానికి మరో కారణం ఖురానులో ఏముందో ముస్లిములలో కూడా అనేకులకు తెలియదు. ఖురాను ఇప్పటికీ మూసిఉంచిన పుస్తకంలాంటిది. అందరూ మనమతంలో వలనే ముస్లిము మతం కూడా ఉంటుందని అనుకుంటారు. అది కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. నేను వ్రాసిన టపాలో ఏమైనా తప్పులు, లేక అబద్దాలు ఉన్నచో నాకు తెలిపిన సరిదిద్దుకోగలనని మనవి చేసుకుంటున్నాను. అవేశంతో కాకుండా నేను ఎక్కడ తప్పు వ్రాసానొ దాన్ని సరిదిద్ది మీ బ్లాగులలో, లేదా కామెంటులలో తెలిపిన నేను చాలా సంతోషిస్తాను.)

గమనిక: ఈ టపాలో విగ్రహాలను పూజించే మక్కావాసులను మక్కావాసులు అని సంబోధించడం జరిగింది. ముస్లిములు కూడా మక్కాలోనే ఉంటున్నప్పటికీ వారిని మాత్రం ముస్లిములని, ఇతరులను (వారి తెగతో సంబంధం లేకుండా) మక్కావాసులని సంబోధించడం జరిగింది. సహృదయంతో అర్థం చేసుకోగలరని భావిస్తూ………

క్రితం టపాలో జరిగినది: మహమ్మదును మరియు ఇతర ముస్లిములను మక్కావాసులు వెలివేసారు. కానీ కాబాకు ప్రతీ సంవత్సరం జరిగే ఉత్సవాలకు మాత్రం రానిచ్చేవారు. ఇలా మూడు సంవత్సరాలు గడిచాక మక్కావాసులు ముస్లిములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పటికి మహమ్మదుకు యాభైసంవత్సరాలు. ఇక చదవండి.

మహమ్మదుపై నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత అతనిని మక్కావాసులు ఏమీ అనలేదు. ఇలా నిషేధాన్ని ఎత్తి వేయడానికి అబూ తాలీబు ఎంతో సహాయం చేసాడు. అప్పటికి తాలీబు వయస్సు ఎనభై సంవత్సరాలపైనే. కానీ అతనిపై నిషేధాన్ని ఎత్తివేసిన కొన్ని నెలల తరువాత మహమ్మదు భార్య ఖదీజా మరణించింది. అది మహమ్మదుకు వ్యక్తిగతంగా తొలి దెబ్బ. మహమ్మదుకు ప్రేమ, ఆస్తి, ప్రవక్త అని నమ్మకం (Confidence of being a prophet), కష్టకాలంలో రక్షణ, సంతానం, ఇలా అన్నీ ఇచ్చిన వ్యక్తి ఖదీజా. అలాంటి ఆమె చనిపోవడం మహమ్మదును ఎంతో బాధించింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఖదీజా మరణించిన అయిదు వారాల తరువాత అబూ తాలీబు కూడా మరణించాడు. ఇలా తనకు అన్నీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు వరుసగా చనిపోవడంతో మహమ్మదుకు చాలా కష్టమయిపోయింది. అప్పటికి మహమ్మదు యొక్క పిల్లలందరూ (కుమార్తెలు మాత్రమే, కుమారులు ఎవ్వరూ బతికిలేరు ఒక్క జయీదు తప్ప) తమ భర్తల వద్దకు వెళ్ళిపోయారు. మిగిలినది ఫాతిమా మాత్రమే. అమె అప్పటికి ఇంకా చిన్నపిల్ల. అప్పటి సమాజంలో బహుభార్యత్వం, బహుభర్తృత్వం సామాన్యమే అయినా మహమ్మదు ఖదీజా బ్రతికి ఉన్నంత వరకూ ఇతరులు ఎవ్వరినీ పెళ్ళి చేసుకోలేదు(Pg 102). అబూ తాలీబు చచ్చిపోతూ తనను ముస్లిముగా మారకుండా ఖొరేషియా తెగ వారు అడ్డుకున్నారని మహమ్మదుతో చెప్పడని ముస్లిము రచయితలు చెప్పారు. కానీ తాలీబు జీవితాంతం ప్రవర్తించిన విధాన్ం, ఎన్ని కష్టాలకు ఎదురైనా నిలబడిన తత్వాన్ని బట్టి మనం అతను తన కుమారుడైన మహమ్మదును కాపాడుకోవడానికి ఎంతో కష్టపడ్డాడనీ, మరియు అతనికి ఎప్పుడూ ముస్లిముగా మారే ఆలోచనలేదనీ స్పష్టంగా అర్థమవుతుంది. తాలీబు విగ్రహాదేవతలను ఆరాధిస్తూ పుట్టినవాడు, అలాగే చాచ్చిపోవాలనుకున్నాడు, అలాగే చచ్చిపోయాడు. కానీ మహమ్మదుకు ఎంతో సహాయం చేసాడు. అబూ తాలీబు చనిపోవడంతో మహమ్మదుకు బధ్దశత్రువైన అబూ లహాబుకు ఎందుకో మహమ్మదు మీద జాలి కలిగింది. మహమ్మదును తాను జీవితాంతం కాపాడుతానని చెప్పాడు కానీ కొన్నాళ్ళ తరువాత ఖొరేషియా తెగవారు అతనిని తమ వైపు తిప్పుకోగలిగారు. అప్పటి వరకు మక్కావాసులు ఒక్క తాలీబును చూచి మాత్రమే మహమ్మదుకు కీడు తలపెట్టకుండా ఆగారు. అలా అబూ లహాబు మారగా, అతనిని తిడుతూ ఒక సురాను మహమ్మదు వెలువరించాడు. ఆ సురా ఇక్కడ: (pg:104)


ఈ సమయంలో వెలువడ్డ సురాలన్నీ (సందేశాలు) కాస్త హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయి. ఇప్పుడు మహమ్మదు పరిస్థితి కాస్త విషమంగా తయారయ్యింది. తాను మక్కాలో ఉన్నత స్థాయికైనా ఎదగాలి లేదా ఆ పోరాటంలో ప్రాణాలయినా కోల్పోవాలి. ఇస్లాము విగ్రహఆరాధకుల చేతిలో పరాజయం పొందాలి లేదా విగ్రహఆరాధకులు ఇస్లాము చేతిలో పరాజయం పొందాలి.

ఇప్పుడు మహమ్మదు ఆలోచించడం మొదలుపెట్టాడు. గత నాలుగు సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ ప్రముఖలెవ్వరినీ తన మతంలోకి ఆకర్షించలేకపోయాడు. చిట్టచివరిగా తన మతంలోకి మారిన వారు ఒమర్ మరియు హమ్జా, అది కూడా మూడు నాలుగు సంవత్సరాల ముందు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న పట్టణాలవైపు చూడగా అందులో చెప్పుకోదగ్గ పట్టణం తయీఫు (తరువాత మదీనాగా పేరు మారింది). అది తొంభై, వంద కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మహమ్మదు తన కొడుకు జయీదు మరియు జోనాహ్ లను తీసుకుని తయీఫు పట్టణం వెళ్ళాడు. అక్కడ ఆ పట్టణపు పెద్దలయిన ముగ్గురు సోదరులవద్దకు వెళ్ళి కొంచెం సహాయం చేయమని ఆడిగాడు. తయీఫు పట్టణవాసులకు మక్కావాసులంటే ఈర్ష్య వారికి పలుకుబడి ఉన్న దేవతలు కలవారనీ, కాబా గుడి ఉన్నదని. కానీ వారు మహమ్మదుకు సహాయం చేయడానికి సంకోచించారు. వారు నిరాకరించారు. అప్పుడు మహమ్మదు తను అక్కడికి వచ్చినతట్లు మక్కాలోవారికి చెప్పవద్దు అని అన్నారు. దానికి తయీఫు వాసులు సంకోచిస్తూ అంగీకరించారు (pg: 105). ఎవరూ సహాయం చేయకపోవడంతో తయీఫు పట్టణంలో పది రోజులు ఉండి ఇస్లాము మతం గురించి ప్రచారం చేసాడు, కానీ ఎవ్వరూ ముస్లిములుగా మారలేదు (pg:106).

తరువాత మహమ్మదు తన స్వంత పట్టణానికి తిరిగివచ్చినా బయటే ఉండిపోయాడు. తను పట్టణంలోకి వెడితే చంపుతారనే భయంతో తన ప్రాణానికి హామీ ఇవ్వవలసిందిగా పట్టణపెద్దలను రెండుసార్లు అహ్వానించాడు. కానీ ఎవ్వరూ అంగీకరించలేదు. మూడోసారి తనపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సహాయం చేసిన ముతాయిం అనే పెద్దమనిషిని సాయం అడిగాడు. అందుకు ముతాయిం అంగీకరించి తన పిల్లలను తోడుగా తీసికొని మహమ్మదును పట్టణంలోకి తీసుకువచ్చాడు (pg: 108). ఇలా మహమ్మదు యొక్క తయీఫు ప్రయాణం విఫలమయింది.

మహమ్మదు ఖదీజా చనిపోయిన మూడు నాలుగు నెలల తరువాత సావ్డా అనే విధవను వివాహం చేసుకున్నాడు. సావ్డా సక్రాన్ అనే ముస్లిము యొక్క భార్య. అతను అబిస్సీనియా నుంచి మక్కాకు వస్తున్న దారిలో మృతిచెందాడు. సావ్డాను వివాహం చేసుకున్న సమయానికి కాస్త అటూ ఇటుగా అబూ బక్ర యుక్క కుమార్తె అయిన అయేషాను కూడా వివాహం చేసుకున్నాడు. అలా అబూ బక్రకు మహమ్మదుకు మధ్య మిత్రత్వం మరింత దృఢంగా మారింది. మహమ్మదు ఆయేషాను వివాహం చేసుకునేటప్పుడు మహమ్మదు వయస్సు యాభై కానీ ఆయేషా వయసు ఆరు లేక ఏడు ఉండవచ్చు (pg: 109-110). వీరిరువరి వివాహం మూడు సంవత్సరాల తరువాత (అప్పుడు ఆయేషా వయసు తొమ్మిది) జరిగింది. ఈ విషయంపై ముస్లిములలోనే అనేక వాదోపవాదాలు ఉన్నాయి, ఆయేషాతో వివాహం గురించి తరువాత ఒక టపాలో వివరంగా చెబుతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మహమ్మదు చనిపోయిన తరువాత అయేషా అనేక సంవత్సరాలు జీవించింది, అందుకే అనేక సురాలు ఆమె పేరు మీద ఉంటాయి. ఇస్లాంలో ఆయేషా పాత్రమీద సున్నీ షియా మతస్థులు విడిపోయారని అంటారు.

ఈ సంవత్సరం కాబా ఉత్సవాలలో కొత్తగా వచ్చిన వారిలో కొందరిని మహమ్మదు తన మతంలోకి మర్చుకోగలిగాడు. ఒకసారి మహమ్మదుకు ఒక కల వచ్చింది. దాని సారాంశం ఇది. తనను గేబ్రియేలు రెక్కలగుర్రం మీద జెరూసలేంలోని గుడి వద్దకు తీసుకువెళ్ళినట్లు, అక్కడ ముందటి ప్రవక్తలందరూ తనను ఆహ్వానించినట్లు, అక్కడినుంచి ఒకదానిపై ఒక స్వర్గంగా ఏడవ స్వర్గం వరకు వెళ్ళినట్లు కలగన్నాడు. ఆ కలలో మహమ్మదుకు అల్లా ఏడవ స్వర్గంలో కనబడ్డాడు. అప్పుడు అల్లా తన భక్తులందరూ ప్రతీరోజూ యాభైసార్లు తనకు ప్రర్థనలు చెయ్యాలని ఆదేశించాడు. దానికి మహమ్మదు సరేనని ఒప్పుకొని తిరిగివస్తుండగా ద్వారం వద్ద వేచిచూస్తున్న గేబ్రియేలు అల్లా ఏమి చెప్పాడని అడిగాడు. దానికి మహమ్మదు జరిగినది చెప్పాడు. అప్పుడు గేబ్రియేలు “రోజుకు యాభైసార్లంటే కష్టం కదా కొంచెం తగ్గించమని అడుగు”, అని మహమ్మదుకు చెబితే అప్పుడు మహమ్మదు సరేనని వెళ్ళి అల్లాను అడిగాడు. అందుకు అల్లా సరే రోజుకు నలభైఅయిదు సార్లు ప్రార్థనలు చేయమని చెప్పాడు. మహమ్మదు తిరిగివస్తుండగా ద్వారం వద్ద గేబ్రియేలు ఆపి మళ్ళీ తగ్గించమని అడుగమని చెప్పాడు. ఇలా ప్రతీసారి అల్లా అయిదు తగ్గిస్తూ చివరకు రోజుకు అయిదుసార్లు ప్రార్థనలు చెయ్యాలని ఆదేశించాడు. ఈ సంఘటనను మహమ్మదు ఇతరులకు చెప్పగా మక్కావాసులు నవ్వారు, ముస్లిములు చాలా సంతోషించారు. ఇదే సమయంలో మహమ్మదు తమ దేవతలను తిట్టకపోవడంతో మక్కావాసులు మహమ్మదును ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను ఆపేశారు. ఇప్పుడు ఒక్కసారి చిన్న సురాను చూద్దాం.

Sura is from Pg:121
ఈ సురాలో మనం గమనించవచ్చు అల్లా తనను నమ్మని వాళ్ళపై పగ తీర్చుకుంటాడని. కానీ తన సృష్టిలో భాగమైన వారే కదా ఆ మనుషులు కూడా, కానీ అదేంటో అల్లా కేవలం నమ్మనందుకు పగ తీర్చుకుంటానని మహమ్మదు చేత చెప్పించాడు.

మహమ్మదు యొక్క మదీనాపట్టణపు ప్రయాణం విఫలమయిన తరువాత కాబా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మదీనాలో ఉండే బానీ కజ్రాహ్ తెగకు చెందినవారు ఏడుగురు మహమ్మదుతో ముస్లిములుగా మారుతున్నట్లు చెప్పారు. అప్పుడు వారు తీసుకున్న శపథాన్ని Pledge of Acaba అంటారు. వారు తమ తెగ వద్దకు తిరిగివెళ్ళాక వారి తెగలో మహమ్మదు గురించి ప్రచారం చేశారు. తరువాతి సంవత్సరం మొత్తం పన్నెండు (వీరిలో ఏడుగురు క్రితం సంవత్సరం వచ్చినవారే) మంది బానీ కజ్రాహ్ తెగవారు ముస్లిములుగా మారారు. అప్పుడు మహమ్మదు ముస్లిములలో ఒక వ్యక్తిని ఆ తెగవద్దకు పంపాడు. మూడవ సంవత్సరం ముసిములుగా మారడానికి డెబ్బయిరెండు మంది వచ్చారు. వారందరూ ఒకసారి చీకటిలో కలిసారు. వారందరూ అప్పుడు మహమ్మదుకు తమ మద్దతును ఇస్తున్నట్లు శపథం చేసారు. దీనిని Second pledge of Acaba అంటారు. మహమ్మదు ఇలా రహస్యంగా ముస్లిములను కలిసాడని, ముస్లిముల జనాభా పెరుగుతోందనీ మక్కావాసులకు అర్థమయ్యింది. వారు కాబా గుడి వద్ద విడిదిచేసిన అన్ని తెగలవారి వద్దకు వచ్చి మహమ్మదుగురించి అడిగారు. కానీ అత్యధికులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు, తెలిసిన మదీనాముస్లిములు ఏమీ మాట్లాడలేదు. అందరితోపాటు వీరు కూడా తిరిగి తమ గృహాలకు వెళ్ళిపోయారు.

అలా మదీనాలో కాస్త మద్దతు దొరకగానే మహమ్మదు ముస్లిములను మదీనాకు వలసవెళ్ళమని చెప్పాడు. అలా వలస చాలా రహస్యంగా జరిగింది. ఖొరేషియా తెగవారికి అనుమానం వచ్చింది ఇళ్ళకు ఇళ్లకు ఖాళీ అయిపోవడం చూసి. కానీ వరు ముస్లిములు తమను వీడి వెళ్ళిపోతున్నారని ఆనందించారే కానీ ముందు జరుగబోయేది ఏమిటో ఊహించలేకపోయారు. చివరికి అందరికీ అనుమానం బాగా బలపడి మహమ్మదును సంహరిద్దామని అనుకున్నారు. ఈ విషయం మహమ్మదుకు తెలిసింది. వాళ్ళు అందరూ ఒక గుంపుగా బయలుదేరి మహమ్మదు ఇంటికి వెళ్ళారు. వారి రాకను పసిగట్టిన మహమ్మదు తన మిత్రుడైన అబూ బక్ర ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళడానికి సిద్దపడ్డారు. కానీ తాను అలా వెడితే చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందని ఆలీని తనలాగా నటించమని చెప్పాడు. ఆలీ మహమ్మదు యొక్క బట్టలు వేసుకొని మహమ్మదు పడుకొనే గదిలో నిద్రపోతున్నట్లు నటించాడు. మహమ్మదు లేకపోవడం గమనించిన మక్కావాసులు తమకు వ్యతిరేఖంగా తమను తప్పుడు దోవ పట్టించిన ఆలీని ఏమీ చేయలేదు సరికదా ఇతరులకొరకు తన ప్రాణాలను అర్పించడానికి సిద్దమైనందుకు మెచ్చుకున్నారు. మహమ్మదు మక్కా బయట ఒక కొండగుహలో తన మిత్రునితో కలసి కొన్నాళ్ళు వేచిచూసాడు. మక్కావాసులు మహమ్మదును వెతకమని పంపించిన వారు ఎంత వెతికినా మహమ్మదు తీసుకున్న జాగ్రత్తలవల్ల మహమ్మదు వారి కంటపడలేదు. మహమ్మదు ఉన్న గుహ వద్దకు వారు బాగా చీకటి పడ్డాక వచ్చారు. వారికి చీకటిలో కనబడక వారు వెనుదిరిగారు. ఈ సంఘటనను ముస్లిములు చాలా గర్వంగా అల్లా దయవలననే మహమ్మదు తప్పించుకున్నాడని చెబుతారు. మహమ్మదు ఉన్న గుహను ఒక సాలీడు పూర్తిగా కప్పేసిందనీ ఇంకా వారి ఊహాత్మక శక్తితో నింపివేసారు. ఈ సంఘటనలు జరిగేప్పటికి మహమ్మదు వయసు యాభైమూడు. మదీనా దరిదాపులకు వచ్చాక మహమ్మదును వెతకమని పంపినవారిలో ఒకడు మహమ్మదును గమనించాడు. కానీ తను ఒక్కడు, వారు నలుగురు. అందుకే తను మక్కా వెళ్ళినతరువాత అక్కడ తనవారితో ఏమీ చెప్పలేదు. మహమ్మదు మక్కా విడిచిన మూడురోజుల తరువాత ఆలీ మక్కాను వీడి మదీనా వెళ్ళాడు. ఆలీని కానీ, అబూ బక్ర యొక్క కుటుంబసభ్యులను కానీ, మహమ్మదు కుటుంబసభ్యులను కానీ మక్కావాసులు ఏమీ చేయలేదు. వారిని ప్రశాంతంగా మదీనా వెళ్ళనిచ్చారు. మక్కావాసులకు మహమ్మదుమీద, అతని అనుచరులమీదా ఎంత కోపం ఉందనేది దీనిని బట్టి అర్థం అవుతోంది. వారు కేవలం తమ దేవతలను తిట్టాడని మహమ్మదు మీద కోపం తప్పించి ప్రత్యేకంగా అతని మీద కోపం ఏదీ ఉన్నట్లు మనకు కనబడదు.

వనరు: William Muir, Life of Mahomet, printed: 1891 (పేజీ నంబర్లతో సహా ఇవ్వబడింది. అనుమనం ఉన్నవారు ఈ పుస్తకంలో నేను నంబరు ఇచ్చిన పేజీలో చదువగలరు)
(వచ్చేవారం: మదీనాలో ప్రవక్త)

Monday, February 2, 2009

మహమ్మదు జీవితం – సైతాను సందేశం (Satanic Verses)

మహమ్మదు నలభైనాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తనకు ఏ దయ్యమూ సోకలేదని, తాను ప్రవక్తనని నమ్మకం కలిగింది. తన మతానికి ఇస్లాం అని నామకరణం చేసాడు. తన మతంలో చేరిన వారందరినీ ముస్లిములు/ముసల్మానులు అని పిలువమన్నాడు. తన దైవం అల్లా అని చెప్పాడు. ఈ అల్లా కాబాలో ప్రధాన దేవుడే, కానీ మహమ్మదు మిగతా దేవతలెవ్వరినీ అంగీకరించలేదు. తనకు వస్తున్న సందేశాలు దైవం నుంచి వస్తున్నవి అని, దయ్యాలనుంచి కాదని తనను తాను నమ్మడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. మహమ్మదు అలా నమ్మడానికి ఖదీజా ఎంతో సహాయసహకారాలు చేసింది. ఈ సందేశాలు మహమ్మదు చెబితే మనం నమ్మాల్సిందే కానీ నిజంగా అవి దేవుడినుంచి వస్తున్న సందేశాలని మనకు ఇతరత్రా ఏ ఆధారాలూ లేవు. ఖదీజా అందరి కన్నా ముందు తన భర్త ప్రవక్త అని నమ్మింది కాబట్టి ఆమె మొదటి భక్తురాలని ముస్లిముల నమ్మకం. ఇలా మహమ్మదును మొదట నమ్మి అతని మతంలో చేరింది అతని ఇంటి సభ్యులు మరియు మహమ్మదుకు ఆప్తమిత్రులు. మహమ్మదును పెంచిన అతని పెదనాన్న అబూ తాలీబు మాత్రం జీవితాంతం తన పాత మతానికే కట్టుబడి ఉంటానని చెప్పాడు, అదే సమయంలో మహమ్మదును ఎవరైనా బెదిరిస్తే తాను మాత్రం కాపాడుతానని చెప్పాడు.
మహమ్మదు అనుచరులలో కొందరు ఆలీ, జయీద్ మాత్రమే చిన్న పిల్లలు. ఆలీ అబూ తాలీబు యొక్క కొడుకు. జయీదు గురించి కొంచెం చెప్పాలి. జయీదును ఖదీజా యొక్క అల్లుడు అనేక బానిసలతో పాటు తీసుకువచ్చి ఖదీజాను నచ్చిన బానిసను తీసుకోమంటే ఖదీజా జయీదును తన బానిసగా తీసుకుంది. మహమ్మదు జయీదును చూచి తనకు బానిసగా కావాలని అడిగితే ఖదీజా ఇచ్చివేసింది. మహమ్మదు జయీదును బానిసలా కాకుండా కొడుకులా చూచుకున్నాడు. జయీదు మహమ్మదు వద్ద ఉన్నాడని తెలిసిన జయీదు తండ్రి మహమ్మదు వద్దకు వచ్చి తన కొడుకును తనకు ఇచ్చివేయమని అందుకు ప్రతిగా ఎంతైనా ధనాన్ని ఇస్తానని చెప్పాడు. మహమ్మదు జయీదును ఎవరి వద్ద ఉండాలో నిర్ణయించుకోమని చెప్పగా, జయీదు మహమ్మదు వద్ద ఉంటానని చెప్పాడు. అప్పుడు మహమ్మదు జయీదును దత్తతచేసుకుని తన కొడుకుగా ప్రకటించాడు. మహమ్మదు పుత్రులలో జయీదు ఒక్కడే యుక్తవయస్సు వచ్చేవరకు బ్రతకగలిగింది. మహమ్మదుకు ఇతర భార్యలద్వారా అనేకమంది పుత్రులుపుట్టినా ఎవ్వరూ ఎక్కువకాలం బ్రతుకలేదు. మహమ్మదు చనిపోయేనాటికి కొడుకులుగా ఒక్కరు కూడా బ్రతికిలేరు. జయీదు కూడా మహమ్మదు కన్నా ముందే చనిపోయాడు.
మహమ్మదు యొక్క మొదటి అనుచరులలో ముఖ్యులు అబూ బక్ర్, సాద్, జొబెయిర్, తల్హా, ఉత్మాన్, అబ్ద్ ఉల్ రెహ్మాన్, ఒబెయిదా, అబూ సల్మా, అబూ ఒబెయిదా వంటి వారు కొందరు. వీరందరి కన్నా ఉమర్, హమ్జాలను తన మతంలోకి మార్చుకోగలగడం మాత్రం మహమ్మదు యొక్క అదృష్టం. తొలి నాలుగు సంవత్సరాలలో మహమ్మదు యొక్క అనుచరులుగా మొత్తం ౩౩ మంది ఉండేవారు. మహమ్మదు తాను ప్రవక్తనని అప్పటి దేవుళ్లందరూ నిజమైన వారు కాదనీ వారిని దూషించాడు. మొదట వీటిని తేలిగ్గానే తీసుకున్నారు అక్కడి ప్రజలు. కొన్నాళ్ళ తరువాత మహమ్మదు ఉపన్యాసాలిస్తూ దారిన వెడుతున్నా వారందరినీ పిలుస్తూ తన మతంలోకి చేరమన్నాడు. వీటిని అక్కడి పౌరులు పెద్దగా పట్టించుకోలేదు. వారందరూ “ఆ అదిగో స్వర్గాలగురించి మాట్లాడే అబూ ముత్తాలిబ్ మనవడు చూడండి” అని అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మహమ్మదు తన నాలుకకి పదును పెంచి ఎప్పుడైతే అక్కడి పౌరులు పూజిస్తున్న దేవతలను దూషించడం మొదలుపెట్టాడు. మహమ్మదు దేవతలను తిట్టి ఊరుకోలేదు, అక్కడి పౌరులందరినీ ఉద్దేశించి వారి పూర్వీకులందరూ నరకంలో ఉన్నారని తనను నమ్మనందుకు బాధలు అనుభవిస్తున్నారని దెప్పటం మొదలుపెట్టాడు.దీంతో అక్కడి పౌరులకు అతని మీదా ఏహ్యత ఏర్పడింది. అది కోపంగా రూపుదాల్చడానికి పెద్ద సమయం పట్టలేదు. తమ దేవుళ్ళని తిట్టేసరికి అక్కడి పౌరులు తట్టుకోలేక్ మహమ్మదు అనుచరులను హింసించడం మొదలుపెట్టేవారు. ఇది ఎక్కువగా ప్రముఖ కుటుంబాలకు చెందనివారిని మాత్రమే హింసించేవారు.
మధ్యలో ఒకసారి కొంతమంది ముస్లిములు (పదకొండు మంది) తమ భార్యా బిడ్డలతో సహా అబిస్సీనియాకు పారిపోయారు. వారిని వెంటాడిన ఖొరేషియా తెగ ప్రజలు వారిని పట్టుకొనేలోపే వారు ఓడ ఎక్కు వెళ్ళిపోయారు. మనం ఇక్కడ కొన్ని మార్పులు గమనించవచ్చు. ఇలా ముస్లిములను (ముసల్మానులు) వేధించకమునుపు (చేజేతులారా చేసుకున్నది) సందేశాలు కాస్త చిన్నగా (పావుపేజీ), అందంగా, భాష అంతా ప్రశాంతంగా ఉండేవి. కానీ ముస్లిముల మీద వేధింపులు ఎక్కువయ్యేకొద్దీ సందేశాలలో కోపం, ఇతరులను తిట్టడం, పొడవు (ఒకటి నుంచి ఒకటిన్నర పేజీ) బాగా ఎక్కువయ్యాయి. ఇలా కొన్ని కొన్ని సార్లు కొన్ని సందేశాలు ఇతర సందేశాలను తప్పనేవి. ఒక సందేశం ముందు వచ్చిన సందేశం తప్పని, ఇప్పుడు వస్తున్నది మాత్రమే నిజమని చెప్పేవి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
మూడు నెలలు కూడా గడవకుండానే వారిలో కొందరు వెనుకకు తిరిగి వచ్చారు. అలా రావడానికి ఒక కారణం ఉంది. ఈ సంఘటన గురించి హిషామ్ ఒక రకంగా చెబితే తబరి, వాకిడి మరో రకంగా చెప్పారు. (వీరు ముగ్గురు వ్రాసినవే ఇప్పటికీ ముస్లిములకు ప్రామాణికం) మహమ్మదు యొక్క ధ్యేయం మక్కావాసులనందరినీ తన మతంలోకి మార్చుకోవాలని. కానీ తనను అంగీకరించింది కేవలం యాభైమంది మాత్రమే అది కూడా మిగతా కుటుంబాలు, సంఘానికి వ్యతిరేఖంగా. తనకు తెగలో ముఖ్యమైన నాయకులందరూ వ్యతిరేఖంగా ఉన్నందున మహమ్మదు చాలా నీరసపడిపోయాడు. తమ అలవాటులో భాగంగా ఒకరోజు మక్కాలో ఉన్న పెద్దలందరూ కాబా గుడులో కూర్చొని అన్ని విషయాలగురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు మహమ్మదు అక్కడికి వచ్చి స్నేహపూర్వకంగా అక్కడ కూర్చొని మొదట దైవదూత తనకు ఎలా కనబడ్డాడని సందేశాన్ని వినిపించి తరువాత ఈ సందేశాన్ని వినిపించాడు.










అల్-ఉజ్జా, ఆల్-మనాత్, అల్-లత్ అనే వారు అప్పటి కాబా ప్రధాన దేవుడైన అల్లా యొక్క కుమార్తెలు. తమ దేవతల పేర్లు వినపడగానే మహమ్మదుతో పాటు అందరూ అప్పుడు నమస్కరించారు. ఇది విని అందరూ చాలా సంతోషించి అప్పుడు మహమ్మదును పొగిడారు. తమలో ఒకడని మెచ్చుకున్నారు. ఆ సాయంత్రం మహమ్మదు ఇంటిలో ఉండగా వచ్చిన సందేశం ఇది “తాను ఇవ్వని సందేశాన్ని తాను ఇచ్చానని ఎందుకు చెప్పావని దేవుడు కోపంగా ఉన్నాడు. ఆ దేవతల పేర్లు చెప్పినది దేవుడు కాదనీ, సందేశాన్ని మధ్యలో సైతాను మార్చివేసాడు”. వీటినే సాతానిక్ వెర్సెస్ (Satanic Verses) అంటారు.
ఈ సంఘటన జరిగాక మహమ్మదు మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందరూ సందేశాలు నిజము కాదని అనుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ నిజమేఅయితే, ఏవి నిజం, ఏవి కావు? సైతాను కూడా సందేశాలు పంపగలుగుతున్నాడంటే మహమ్మదును ఎంతమాత్రం నమ్మగలం? అని అనుకున్నారు. ఇక అక్కడి నుంచి మహమ్మదును అతని అనుచరులను హింసించడం ఎక్కువయ్యింది.
ఇలాంటి సమయంలో ఖురేషియా తెగవారు తమ దేవతలను తిట్టడంతో కోపం వచ్చి అబూ తాలీబుకు చెప్పారు. అబూ తాలీబు తాను మాత్రం తన పాత మతంలోనే ఉంటానని చెప్పాడు. వారు అలా ప్రవర్తించడంలో వింతలేదు. ఎందుకంటే తమ కళ్ళముందు పుట్టి, నలభై సంవత్సరాలు పెరిగిన వ్యక్తి హఠాత్తుగా నాకు దేవుడినుంచి సందేశాలు వస్తున్నాయి, మీరు పూజిస్తున్నది రాళ్ళను, మీ తాతముత్తాతలు అందరూ నరకంలో ఉన్నారు, మీరు అందరూ నన్నే పూజించండి అంటే అక్కడ ఉన్న వారందరికీ కోపం వచ్చింది. మొదట అతనికి పిచ్చి పట్టిందనుకున్నారు. అందుకు వారు ఖదీజా వద్దకు వచ్చి, నీ భర్తకు మేము సహాయం చేయిస్తాము, మంచి వైద్యుడిని చూడు అని చెప్పారు. ఇలాగే అబూ తాలీబుకు కూడా చెప్పారు. కానీ ఖదీజా తన భర్తకు సహకారాన్ని అందించింది. ఇలా కొంత కాలం మహమ్మదు వారి దేవతలను తిట్టడం భరించలేక వారు అతని సంవాదానికి సిద్దమయ్యారు. అప్పుడూ మహమ్మదు మొదట బాగానే తన దేవుని గురించి వాదించినా మధ్యలో ఖురేషియావారు పైచేయి సాధించడంతో వాదన అర్థాంతరంగా ఆపేసి మళ్ళీ వారినీ వారి దేవతలను తిట్టడం మొదలుపెట్టాడు. ఖదీజా ధనవంతురాలవడం వలన, తాలీబు సహాయం చేయడం వలన మాత్రమే మిగతాతెగవారు మహమ్మదును చంపకుండా వదిలివేసారు. ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు లేని వారిని మాత్రం బాగా హింసించారు.
ఖురేషియా తెగలో కొంతమంది ఒకసారి నీ దేవుడిని నీకు మంచి మంచి పూలతోటలు, అమితమైన ధనం, బంగారం ఇవ్వమని చెప్పు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని అడిగారు. అందుకు మహమ్మదు నేను వచ్చినపని అదికాదు, నేను అలా అడుగను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు సరే స్వర్గాన్ని నీ మీద పడవేయమని మీ దేవుడికి చెప్పుమని అడుగగా, అందుకు మహమ్మదు అదంతా నా దేవుడి ఇష్టం అని సమాధానం చెప్పాడు. అప్పుడు అందులో ఒకడు సరే మేము నిన్ను చంపుతాము, నీ దేవుడు అతని దూతలను వెంటబెట్టుకుని వస్తారేమో చూద్దాం అని అన్నారు.
ఇక ఇలా కాదని ఖురేషియా తెగ వారు ముస్లిములు ఎవ్వరూ తమవారిని వివాహం చేసుకోకూడదని ముస్లిములమీద సామాజిక, ఆర్థికమైన ఆంక్షలు విధించారు. ముస్లిములను బహిష్కరించారు. ఇది చాలా సత్ఫలితాలను ఇచ్చింది. మూడు సంవత్సరాలపాటు మహమ్మదుకు కాలూ చెయ్యీ ఆడలేదు. మహమ్మదు, అతని అనుచరులకు మక్కాలో ఏమీ పుట్టలేదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అమ్మాలంటే చాలా అధికధరకు అమ్మేవారు. ఇలా కొంతకాలం గడిచాక ముసిముల పరిస్థితి చాలా దారుణంగా మారింది. చుట్టుపక్కలవారికి ముస్లిముపిల్లల ఆకలి కేకలు వినపడేవి. మహమ్మదు, ముస్లిముల స్థితి మీద జాలి పడి ఖురేషియా తెగవారే అతని మీద ఉన్న ఆంక్షలను రద్దుచేసారు కాని ఎవ్వరూ ముస్లిములుగా మారలేదు. మహమ్మదును కాబాలో ప్రతీ సంవత్సరం జరిగే ఉత్సవాలకు మాత్రం రానిచ్చేవారు. అప్పుడు మహమ్మదు అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశించి అల్లాను పూజించమని చెప్పేవాడు. దానికి వారు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికి మహమ్మదుకు యాభై సంవత్సరాలు.
సశేషం. (తరువాయి టపాలో ఖదీజా, తాలీబు మరణం)
Muir = Life of Mahomet – William Muir.

Sunday, January 25, 2009

మహమ్మదు జీవితం – 3

(నేను వ్రాస్తున్న టపాలు చదివి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న బ్లాగు సందర్శకులకు నెనర్లు.)
జరిగిన కధ: మహమ్మదుకు పెళ్ళయి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు పుడతారు. కాని పాపం అదృష్టం లేక అతని ఇద్దరు కొడుకులు చనిపోతే జయీద్ అనే ఒక బానిసను కొడుకుగా దత్తత తీసుకుంటాడు. తనను పెంచిన తాలిబు కొడుకయిన ఆలీని కూడా తన దగ్గరే పెంచుకుంటాడు. అలా మహమ్మదుకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు అతని జీవితం సాఫీగానే సాగిపోయింది. ఇక చదవండి.
అలా మహమ్మదు నలభై సంవత్సరాలవయస్సుకు దగ్గరయినప్పుడు కవితలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి మహమ్మదు హఠాత్తుగా పడిపోయి మాట్లాడుతూ ఉండేవాడు. కొన్నాళ్ళు మక్కా పట్టణానికి దగ్గరగా ఉన్న కొండలు, గుహలవద్దకు ఎక్కువగా వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అలా గుహలలో రోజులతరబడి గడిపేవాడు. ఒకసారి అలా కొండలలో తిరుగుతుండగా మహమ్మదుకు ఒక వెలుగు కనిపించింది. అలా ఆ వెలుగులో కనిపించింది దైవదూత గేబ్రియేల్ (Gabriel. ఖురానులో జిబ్రీయెలు అని చెప్పడం జరిగింది. అది హీబ్రూ భాషనుండి అరబిక్ భాషకు మారినందున జరిగిన మార్పు అని గమనించాలి) అని సురాలో చెప్పబడింది. ఇది మొదట మహమ్మదు కూడా నమ్మలేదు. తన భార్య అయిన ఖదీజాకు చెబితే ఆమె మొదట భూతవైద్యులను పిలిపించి, మహమ్మదుకు వైద్యం చేయించింది.(Muir – 49). కానీ మహమ్మదుకు ఇంకా వెలుగు కనబడడం, మాటలు వినబడడం ఆగలేదు. ఇలా మాటలు వినబడడం (దీనినే సందేశమని (Revealation) ముస్లిములు నమ్ముతారు) ఎప్పుడు జరుగుతుందో మహమ్మదుకు కూడా తెలియదు. ఒక్కోసారి ఆరు నెలలనుంచి మూడు సంవత్సరాలవరకు కూడా మాటలు వినబడేవి కాదు. (Muir-49) ఇలాంటి సమయంలో తనకు వస్తున్నవి నిజంగానే సందేశాలేనా అని మహమ్మదు కూడా సందేహం వచ్చింది (Muir 50,51). ఒకవేళ అవి నిజంగా సందేశాలే అయితే అవి దైవం నుంచి వస్తున్నవా లేక సైతాను నుంచి వస్తున్నవా అని ఇంకో సందేహం వచ్చింది. ఇలాంటి సమయంలో ఖదీజా చేసిన పనులను మనం చెప్పుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది. ఖదీజా తన భర్తను సైతాను పీడిస్తున్నాడేమోనని ఒక రోజు అనుమానంతో మహమ్మదు ఇలా నిద్రలో చెబుతున్నప్పుడు మొదట తన కుడి తొడ మీద అతనిని కూర్చోబెట్టుకుంటుంది. మహమ్మదు ప్రవర్తనలో ఏ మార్పులేకపోవడంతో తన ఎడమతొడమీద కూర్చోబెట్టుకుంది. అప్పటికీ మహమ్మదు ప్రవర్తనలో ఎలాంటి మార్పూలేకపోయేసరికి తన బట్టలన్నీ విప్పదీసింది. అప్పుడు మహమ్మదు అలా మాటలు చెప్పడం మానేసాడు. దానితో తన భర్తకు ఏ దయ్యమూ సోకలేదని ఖదీజా నిర్ణయించుకొంది. (Muir – 50)
ఒకసారి మహమ్మదు తనకు దైవదూత కనబడడం లేదని అలా కొండలమీదకు ఆత్మహత్య చేసుకుందామని (Muir 50) వెళ్ళి పోతే ఒక హస్తం అతన్ని ఇంటికి తీసుకువస్తుంది. అది దైవదూత అని ముస్లిములు అభిప్రాయం, కాని సురాలలో అలా చెప్పలేదు. ఇంటిలో మానసికంగా క్రుంగిపోయిన భర్త కనబడడం లేదని తన పనిమనుషులను ఖదీజా మహమ్మదును వెతకడానికి పంపితే వారు అతనిని ఇంటికి తీసుకువస్తారు. (Muir 50) ఇక అప్పటి నుంచి దైవం నుంచి మహమ్మదుకు సందేశాలు వరుసగా వస్తాయి. ఇలా సందేశాలు వస్తున్నప్పుడు మహమ్మదు నేలమీద జీవంలేకుండా పడిపోయి ఉండేవాడు, లేదా నిద్రపోతూ ఉండేవాడు. ఎంత చలికాలమైనా మహమ్మదుకు సందేశం వస్తున్నప్పుడు నుదుటిమీద తీవ్రమయిన చమటతో తడిసిపోయేవాడు. ఇలా సందేశం వచ్చినప్పుడు తీవ్రమైన వేగంతో గాలి పీలుస్తూ ఉండేవాడు. (Muir -51)
సందేశం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అడిగితే మహమ్మదు “సందేశం నాకు రెండు రకాలుగా వస్తుంది. కొన్నిసార్లు దైవదూత అయిన గేబ్రియేలు స్వయంగా నాతో మాట్లాడేవాడు. అది ఇతర వ్యక్తితో మాట్లాడినట్లు బాగానే ఉంటుంది. కాని కొన్నిసార్లు నాకు చెవుల్లో గంటలు మ్రోగుతున్నట్లు, ఆ శబ్దం నా గుండెలను తాకుతున్నట్లు ఉండేది. నాకు కాస్త ఇబ్బంది పెట్టేది ఇది”, అని చెప్పాడు. (Muir – 51)
Muir = Life of Mahomet – William Muir. పక్కన ఉన్న అంకె ఆ సంఖ్య పేజీలో నేను చెప్పినది కనబడుతుంది.
(నేను ఈ టపాలో వ్రాసినది చాలా మందికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు. నేను తప్పు వ్రాస్తున్నాని అనుకోవచ్చు. మరోసారి మనవి చేస్తున్నాను నేను వ్రాస్తున్నది పైన చెప్పిన పుస్తకం నుంచి. ఆ పుస్తకం వ్రాసినది William Muir. ఆ పుస్తకాని 1890లో వ్రాసాడు. ఆ పుస్తకాన్ని గూగులమ్మ ఉచితంగా అందిస్తుంది. నేను తప్పు చెబుతాననుకునేవాళ్ళు ఆ పుస్తకం చదువుకోగలరని ఆశిస్తూ……)
సశేషం.

Thursday, January 22, 2009

పాలస్తీనా - దాని చరిత్ర

ఒక్కసారి మనం పాలస్తీనా గురించి దాని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. భౌగోళికంగా పాలస్తీనా ఇస్రాయేలు రెండూ కూడా కలిసిపోయి ఉంటాయి. దీని కన్నా ముందు మనం ఒక్కసారి కొంచెం చరిత్రలో వెనక్కు వెళ్ళి వద్దాం. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. మహమ్మదు ఇక్కడ ఉన్న ఆల్ అక్సా మసీదు నుండి స్వర్గానికి ఎగిరి వెళ్ళాడని ఖురానులోనూ, సిరాలోనూ, అనేక హాడిత్ లలో చెప్పబడియున్నది. (చారిత్రకంగా చూస్తే ఈ ఆల్ అక్సా మసీదు రెండవ క్యాలిఫు (Second Caliph) కట్టించాడు, జెరూసలేమును ముస్లిములు ముట్టడించేటప్పటికి మహమ్మదు చనిపోయాడు.) ఇందువల్ల జెరూసలెము ఈ మూడు మతాలవారికి కావలసిన పట్టణం.

ఇప్పుడు మతాలలో నుంచి చరిత్రలోకి వస్తే రెండవక్యాలిఫు జెరూసలెమును ఆక్రమించుకోకముందు అందులో క్రైస్తవులు, యూదులు ఉండేవారు. ఎప్పుడైతే ముస్లిములు ఆక్రమించుకొన్నారో ఇక అప్పటినుంచి యూరపులోని క్రైస్తవులు, ముస్లిముల మధ్య యుద్దాలు మొదలయ్యాయి. ఈ జెరూసలేము పట్టణం కొన్నాళ్ళు ముస్లిముల ఏలుబడిలో మరికొన్నాళ్ళు క్రైస్తవుల ఏలుబడిలో కొనసాగింది. ఈ పట్టణాన్ని ముస్లిములచెరనుండి కాపాడటానికి ఐరోపాలో క్రూసేడులు మొదలయ్యాయి. మొత్తం మీద ఇలా అందరూ కొట్టుకుంటూ పదమూడవశతాబ్దం వచ్చేసరికి ఇది ముస్లిములచేతిలో స్థిరపడిపోయింది. ఇన్ని యుద్దాలను తట్టుకోలేక అక్కడ ఉన్న యూదుప్రజలు కాస్త యుద్దాలు తక్కువగా ఉండే యూరపుకు తరలివెళ్ళిపోయారు.
మనం చరిత్రలో కాస్త ముందుకు వస్తే రెండవ ప్రపంచయుద్దంలో మనకు ఎంత మంది యూదులు ప్రాణాలు కొల్పోయారో తెలుసు.(సుమారుగా ఆరుమిలియనులమంది అంటే అరవైలక్షలమంది అని ఒక అంచనా. ప్రపంచచరిత్రలో ఇంతకన్నా భయంకరంగా ఒక వర్గానికి చెందిన ప్రజలను చంపడం ఇదే మొదటకాకపోయినా, ఇంతకన్నా ఎక్కువమంది చనిపోయినా యూదులకు వచ్చినంత పేరు మరింకెవ్వరికీ ఎందుకు రాలేదో నాకు తెలియదు.) రెండవ ప్రపంచయుద్దం ముగిసేసరికి యూదులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని అప్పటి అగ్రరాజ్యాలన్నీ(అందులో అమెరికా పాత్ర కాస్త ఎక్కువ అన్నమాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి) కలిసి నిర్ణయించాయి. ఇందుకు ఎక్కడ ప్రదేశం కోసం చూస్తుంటే, ప్రపంచంలో ఖాళీ ఎక్కడా లేనట్లు యూదులకు పుట్టినిల్లయిన జెరూసలేములో ఏర్పాటు చేసారు అదీ దానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిము దేశాలని తెలిసికూడా. దీనికి కొంత పక్కనే ఉన్న గాజాలో భూమిని కూడా ఇజ్రాయేలు అప్పుడప్పుడు తనలో కలిపేసుకుంటోంది. ఇది ఇప్పటిదాకా జరిగిన కధ.
ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్ని. ఇల్లు(ఇజ్రాయేలు) ఒకప్పడు యూదులకు చెందినది. తరువాత యుద్దాలను తట్టుకోలేక యూదులందరూ పక్కింటికి(యూరపుకు) వెళ్ళారు. ఇల్లు ఖాళీగా ఉందని పొరుగింటివాళ్ళు వచ్చికుదురుకున్నారు. సమయం రాగానే ఇంటియజమాని వచ్చాడు, గొడవ మొదలయ్యింది. ఇక్కడ మనం మఖ్యంగా చెప్పుకోవలసినది అప్పటి అమెరికాను. చుట్టుపక్కల అన్నీ ముస్లిము దేశాలే. ఎవ్వరూ అలా చేయడానికి ఒప్పుకోరు. కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, రష్యాలో చాలా ప్రజలు ఉండగలిగినదానికన్నా చాలా అధికస్థలం ఉన్నది. మళ్ళీ అక్కడ ఎవరూ శత్రువులు ఉండరు. కానీ ఇవి అన్నీ కాదని అంతమంది శత్రువుల మధ్యలో దేశాన్ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయేలు-పాలస్తీనాలో మొత్తం జనాభా కలిపితే కోటి మంది అనుకున్నా, ముస్లిములను ముస్లిము దేశాలు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు. పది దేశాలు పది లక్షలచొప్పున పంచుకుంటే చప్పున సమసిపోయే సమస్య ఇది. కానీ ఎవ్వరూ ఆలోచించరు. కనీసం యూదులకు రెండవప్రపంచ యుద్దంలో జరిగినది చూసిన తరువాత ముస్లిము దేశాలు కొంతమంది ముస్లిములను తమ దేశంలోకి రానిస్తే అస్సలు గొడవ ఉండదు. ఇజ్రాయేలు కూడా ముస్లిములను వారి మసీదును దర్శించుకనే, నిర్వహించుకునే అవకాశాలు వారికే ఇస్తే ఇవ్వాళ పాలస్తీనాలో ఎవ్వరూ చనిపోరు.
తమ భూభాగంలోకి ముస్లిములను ఏ ఇతరముస్లిము దేశాలు అంగీకరంచడంలేదు. ఇది తమ భూభాగమని ముస్లిముసంస్థలు తీవ్రవాద కార్యకలాపాలతో అమాయక ప్రజలను చంపుతారు. దీనికి ప్రతిగా ఇజ్రాయేలు(మనలాగా చేతగాని దేశం కాదు కాబట్టి) ఇలా అప్పుడప్పుడూ పక్క దేశాలకి షికారు వెళ్ళినట్లు దాడులు చేస్తుంది. ఇవి అన్నీ అగ్రరాజ్యాలు ఆడుతున్న కుట్రలు, దీనిలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం సామాన్యులు. వీటి గురించి వ్రాసి మనకు చేతులు నొప్పులు.