Monday, February 16, 2009

మహమ్మదు జీవితం: మదీనాలో ప్రవక్త

మహమ్మదు తన యాభైమూడవ సంవత్సరంలో అనగా 622AD నాడు మదీనాకు వలసవెళ్ళాడు. అందుకు గుర్తుగా ఆ సంవత్సరాన్ని హెజ్రా (1) సంవత్సరమని (Year of Hejira) పిలుస్తారు. ముస్లిముల సంవత్సరాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. వారు సంవత్సరాలను లెక్కవేసేటప్పుడు హెజ్రా నుంచి ఒకటవ సంవత్సరం, రెండవ సంవత్సరం…… అని పిలవడం మొదలుపెట్టారు. ముస్లిముల సంవత్సరాలు అందుకే 1000 AH, 1100AH అని ఉంటాయి. ఇది కాస్త వింతగానే అనిపించవచ్చు, ఎందుకంటే క్రైస్తవ సంవత్సరాలు క్రీస్తు పుట్టిన దగ్గర నుంచీ మొదలవుతాయి. కానీ ముస్లిముల సంవత్సరాలు మహమ్మదు పుట్టిన సంవత్సరం నుంచి, మహమ్మదు ప్రవక్త అని ప్రకటించిన సంవత్సరం నుంచి కాకుండా మదీనాకు వలస వెళ్ళిన దగ్గరనుంచీ మొదలవుతాయి.
మహమ్మదు అలా అబూ బక్ర్ తో ఎనిమిది రోజులు ప్రయాణించి మదీనా చేరుకున్నాడు. ముందు మదీనా వెళ్ళకుండా కోబా అనే చిన్న Suburbలో నాలుగు రోజులు ఉండి అప్పుడు మదీనాలో అడుగుపెట్టాడు. ఆ నాలుగు రోజులలో మహమ్మదు ఒక పెద్ద మసీదుకు పునాది వేసాడు. ఆ మసీదును “దేవుని ఎదుట భయం” అనే పేరుతో తరువాతి కాలంలో పిలిచేవారు. ఆ రోజు శుక్రవారం. అప్పుడు మహమ్మదు మదీనాలో అడుగుపెట్టాడు. అక్కడ ఒక పూజా ప్రదేశంలో ఆగి నమాజు చేసాడు. అప్పుడు మహమ్మదుతో పాటు దాదాపు వందమందికిపైగా ముస్లిములు ప్రార్థన చేసారు. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని యాత్రికులకు చూపిస్తారు. ఆ ప్రదేశాన్ని “Masjid al Juma” లేక “శుక్రవారపు మసీదు” అని పిలిచేవారు. ఇక అప్పటినుంచి ప్రతీ శుక్రవారం ముస్లిములకు పవిత్రమైన దినమని ప్రకటించారు. (pg: 163)

ప్రార్థనలు ముగిసాక మహమ్మదు మదీనాలో తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు మహమ్మదును చూడడానికి ప్రజలు విపరీతంగా ఎగబడ్డారు. మహమ్మదు మసీదు కట్టడంలో తన వంతు సాయం చేసాడు. రోజూ వెళ్ళి అందరితో పాటు తను కూడా పని చేసేవాడు. మహమ్మదు మసీదులో ఒక చోటు పేదలకు కేటాయించేవాడు. రోజూ తను తీసుకునే ఆహారంలో కొంచెం భాగం వారికి పంపేవాడు. అది చూచి మిగతా ముస్లిములు (డబ్బున్నవారు) కూడా అలాగే పంపేవారు. మహమ్మదుతో పాటు మక్కానుంచి వచ్చిన వాళ్ళను “ముహాజరీన్” ((Muhajarin) అనగా వలస వచ్చిన వాడు అని అర్థం) అని పిలిచేవాళ్ళు. వీరికి మదీనాలో సాయం చేసినవాళ్ళను “అన్సార్” (Ansar – Helpers or allies) అని పిలిచేవారు.

అలా మదీనాలో స్థిరపడిన మహమ్మదుకు తన మతంలోకి ప్రజలను మార్చుకోవడం ఎక్కువ కష్టం కాలేదు. చూస్తుండగానే మహమ్మదును ప్రవక్తగా గుర్తించే ప్రజలు విపరీతంగా పెరిగిపోయారు. మదీనాలో మారనివారు సైతం మహమ్మదును ప్రవక్తగా భావించారు. అలా మహమ్మదుకు మదీనాలో ఎదురనేదే లేకుండా పోయింది. మహమ్మదు మదీనాలోకి వచ్చిన తరువాత కొంతకాలానికి (స్పష్టమైన తేదీ ఇవ్వలేదు) యూదులతెగలతో ఒక ఒప్పందానికి వచ్చాడు. అందులో ముస్లిములకు మరియు యూదులకు సమాన హక్కులు ఇచ్చాడు. ఆ ఒప్పందాన్ని ఇక్కడ చూడవచ్చు. (పేజీ 177)

కానీ యూదులకు ముస్లిములకు మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక యూదుడు ముస్లిములతో కలవడం మొదలుపెడితే అతను కొంతకాలానికి మొత్తం తన మతాన్ని మార్చుకోవలసి వచ్చేది. యూదులు ఒకానొక సందర్భంలో తమ యొక్క ప్రవక్త ఖచ్చితంగా ఇష్మాయేలులలో ఒకడుగా పుడతాడుగానీ అరబ్బులలో ఒకడుగా పుట్టడని తేల్చిచెప్పారు(పేజీ 179). అంతేగాక అతను యూదులలో ఒకడుగా పుడతాడనీ డేవిడ్ వారసుడుగా వస్తాడనీ అన్నారు. అలా యూదులలో అత్యధికులు మహమ్మదును ప్రవక్తగా నిరాకరించారు. కానీ ముస్లిములుగా మారిన యూదులు మాత్రం మహమ్మదు నిజమైన ప్రవక్తయని నమ్మారని, వారికి అందుకు తగ్గ ఆధారాలు అన్నీ దొరికాయని మరియు ఇతర యూదులు తమ పూర్వీకులవలెనే (ఏసును నిరాకరించినవారు) నిజమైన ప్రవక్తను నమ్మలేదని ముస్లిము పుస్తకాలు మనకు చెబుతున్నాయి. ఆ కొద్ది మంది యూదులకు లభించిన ఆధారాలు ఏమిటనేది ముస్లిములు తమ పవిత్ర గ్రంథాలలో వివరించలేదు.

మొదట్లో ముస్లిములు రోజుకు అయిదు సార్లు జెరూసలేము వైపు తిరిగి ప్రార్థన చేయాల్సి ఉండేది. మహమ్మదు మదీనా వచ్చిన పదహారూ పదిహేడు నెలల తరువాత మక్కావైపు మార్చాలనుకున్నాడు. అందుకు తగ్గట్లుగా దైవదూత గేబ్రియేల్ ను అడిగాడు. అప్పుడు మహమ్మదుకు సందేశం ఇలా వచ్చింది.


(పేజీ 183). ఇక అప్పటినుంచి ముస్లిములు మక్కా వైపు తిరిగి తమ ప్రార్థనలు చేసేవారు. సుంతీ (పురుషాంగానికి కొంచెం కత్తిరించడం) గురించి ఖురానులో ఎక్కడా ఏమీ రాయలేదు. అది అప్పటి అరబ్బుల ఆచారం. ఆ ఆచారాన్నే ఇప్పటికీ ముస్లిములు కొనసాగిస్తున్నారు (పేజీ: 185). మదీనాకు వలస వచ్చిన తరువాత మహమ్మదు యూదులు కొన్ని రోజులు ఉపవాసం ఉండడం గమనించాడు. యూదులతో మంచి జోడు కుదిరిన రోజులలో ఈ ఆచారాన్ని ఇస్లాములో ప్రవేశపెట్టాడు. కానీ యూదులతో బంధం తెగినవెంటనే ఇది కూడా తెగిపోయింది. ఒకటిన్నర సంవత్సరాల తరువాత మహమ్మదుకు సందేశం వచ్చింది. దాని ప్రకారం అప్పటి నెలను (రంజాన్) ఉపవాసపు నెలగా భావించాలని మహమ్మదు ఆదేశించాడు. ఇది యూదుల ఆచారాలకు కాస్త విభిన్నంగా
ఉంటుంది. ఇలా మహమ్మదు మదీనాలో మొదటి రెండు సంవత్సరాలు గడిపాడు.

Source: William Muir's Life of Mahomet, Printed 1891.

No comments: