Friday, February 20, 2009

మహమ్మదు జీవితం: మక్కా మదీనా మధ్య గొడవలు

మహమ్మదు మదీనా వచ్చిన మొదటి ఆరు నెలలు ప్రశాంతంగానే గడిపాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ముస్లిములందరికీ తమ కుటుంబాలకు తగిన సౌకర్యాలు కలుగజేయడానికి సమయం సరిపోయింది. ఒక్కసారి మక్కా, మదీనాలలో అప్పట్లో జరిగే వ్యాపారం మనం గమనిద్దాం. ఎండాకాలం గడిచిన తరువాత మక్కా నుంచి యెమెన్, అబిస్సీనియాకు వ్యాపారులు గుంపులుగా వెళ్ళేవారు. అదే విధంగా చలికాలం గడిచిన తరువాత మక్కా నుంచి సిరియా వెళ్ళేవారు. వీరందరూ పర్షియా, సిరియా, గాజా, అబిస్సీనియా, యెమెన్ లాంటి దేశాలతో వ్యాపారం నిర్వహించేవారు. మద్యం, పట్టు, తోలు ఉత్పత్తులు, విలువైన రాళ్ళు ఇలా అనేకమైన వాటిని వ్యాపారం చేసేవారు. ఇవి బాగా లాభాలు గడించేవి. కాస్త అటూ ఇటూగా అయిదు లక్షల దీనార్లవరకూ వార్షిక టర్నోవర్ ఉండేది.

మహమ్మదుకు మదీనాలో అలా ఏడు నెలలు గడిచింది. అప్పటినుంచి మక్కాకు వెళ్ళే వ్యాపారగుంపులు (Caravan) మదీనాకు దగ్గరగా వెళ్ళాల్సివచ్చేది. చలికాలం ముగిసిన వెంటనే మహమ్మదు కారావానులను దాడి చేయమని తన అనుచరులయిన ముస్లిములకు చెప్పాడు. మొదటిసారి హమ్జా ఆధ్వర్యంలో ముప్పై మందిని ఒక కారావానుపై దాడి చేయమని పంపాడు. కానీ ఆ కారావానులో మూడు వందలకు పైగా ఉండేసరికి వాళ్ళు అందరూ ఒట్టి చేతులతో తిరిగివచ్చారు. (Pg: 198) తరువాత ఒబెయిదా ఆధ్వర్యంలో అరవై మందిని ఒక కారావానుపై దాడి చేయమని పంపాడు. కానీ ఈ సారి కారావానులో రెండువందల మంది ఉన్నారు. ఈ సారి కూడా ముస్లిములు దాడి చేయలేదు. కారావానులలో ఇద్దరు ముస్లిములు ఉన్నారు. వారు తమపై దాడి చేయడానికి వచ్చిన ముస్లిములను చూచి వారితో కలిసి పారి పోయారు. (Pg:199) ఒక నెల తరువాత మహమ్మదు సాద్ ఆధ్వర్యంలో ఇరవైమందిని దాడి చేయమని పంపాడు. వారు ఒక ప్రత్యేకమయిన చోటు వద్ద దాడిచేయాలని అనుకున్నారు, కానీ వారు ఆ చోటుకు చేరేసరికి ఆ కారావాను వెళ్ళిపోయింది. (Pg: 199) అదే సంవత్సరం ఎండాకాలంలోనూ, ఆ తరువాత మహమ్మదు ఇలా మూడుసార్లు దాడి చేయడానికి వెళ్ళాడు కానీ ఏమీ లాభం లేకపోయింది (Pg: 199-200). ఒకసారి మహమ్మదు ఇలా దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కుర్జ్ ఇబ్న్ జబీర్ అనే మరో అరబ్బు తెగకు చెందిన దోపిడీదొంగ మదీనాకు చెందిన అనేక ఒంటెలను, మేకలను తస్కరించాడు. మహమ్మదు అతనిని వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఒకసారి దాడికి అబ్దుల్లాహ్ ఇబ్న్ జాష్ను పంపాడు. అతనితోపాటు మరో ఏడుగురిని కూడా పంపాడు. వాళ్ళు నఖ్లా అనే ప్రదేశానికి వచ్చి రాబోయే కారావానుకోసం వేచి చూస్తున్నారు. వారు అక్కడికి వచ్చిన తరువాతి రోజు కారావాను అక్కడికి వచ్చింది. అందులో కేవలం నలుగురు మనుషులు మాత్రమే ఉన్నారు. అప్పటికి పవిత్రమాసాలు ముగియలేదు. ఆ రోజు చివరి రోజు. దాడికి వెళ్ళిన వారిలో ఒకడు తలను పూర్తిగా క్షవరం చేయించుకుని గుండుతో ఉన్నాడు. అతన్ని చూచి వారు దాడి చేయడానికి రాలేదని కారావానులో అందరూ అనుకున్నారు. వాళ్ళకు దగ్గరగా వెళ్ళినప్పుడు ముస్లిములు వారిలో ఇద్దరిని చంపి కొంత సొమ్ముతో పారిపోయారు. కానీ వాళ్ళందరికీ పవిత్రమాసంలో యుద్దం చేసామన్న అపరాధ భావం వారి మనస్సులలొ ఉండి పోయింది. ఆ రాత్రి వారు చెప్పినది విన్న మహమ్మదు వారిని ఊరడించాడు. అప్పుడు మహమ్మదుకు పవిత్రమాసంలో ముస్లిమేతరులను చంపడం కన్నా ఇస్లాముకు వ్యతిరేఖంగా ఉండడం పెద్దపాపమని సందేశం వచ్చింది (Pg: 201-203). ఆ దాడిలో వచ్చిన సొమ్మును ముస్లిములందరూ పంచుకొని ఆ సొమ్ములో అయిదోవంతు మహమ్మదుకు ఇచ్చారు (Pg:203). మక్కానుంచి మహమ్మదు మదీనాకు వచ్చి సంవత్సరమయ్యింది. మక్కావాసులకు సిరియాతో వ్యాపారం చాలా ముఖ్యం. అది వారికి ప్రాణవాయువు వంటిది. ఇప్పుడు మహమ్మదు వల్ల తమ వ్యాపారానికి ముప్పు వచ్చింది. తమ శత్రువు జీవితాలను కానీ పవిత్రమాసాలయొక్క పవిత్రతను చూచి కానీ ఆగేలా కనబడడం లేదు. కానీ మక్కావాసులు మహమ్మదు మీద దాడికి యోచన చేయలేదు. మహమ్మదు అనుచరులు (ముస్లిములు) అనేకులు మక్కాలోనే ఉన్నప్పటికీ వారిని ఇబ్బందులకు గురి చేయలేదు. కానీ మక్కావాసులకు మహమ్మదు/ముస్లిములకు మధ్య దూరం పెరిగిపోతున్నది (Pg: 203-204). ఈ సమయంలో మక్కావాసులపై, ముస్లిమేతరులపై పగ తీర్చుకోమని మహమ్మదుకు సందేశం వచ్చింది.

సురా: xxii, V 41 (Pg: 204)

సురా: ii, V 191 (Pg: 204)

(Pg: 204)

అప్పటినుంచి మతం ప్రాతిపదికన యుద్దం చేయవచ్చు అని ముస్లిములకు మహమ్మదు చెప్పాడు. శత్రుత్వాన్ని కాఫిర్లను (ముస్లిమేతరులు) తరిమివేయడం పేరిట మొదలుపెట్టారు. ఇలా చేయడంలో మహమ్మదు ముస్లిములకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసాడు – ఈ భూమి మొత్తం మీద ఇస్లాము తప్ప మరే మతం మిగలకూడదు అని. ఆ యుద్దంలో ఖచ్చితంగా ముస్లిములు గెలుస్తారని వారికి దైవం సాక్షిగా మహమ్మదు చెప్పాడు (Pg: 204-205). ఈ సమయంలో మక్కాలో చెప్పిన శాంతియుత సురాలన్నీ తప్పని ఒక సందేశం వచ్చింది. అంతేగాక యుద్దంలో చనిపోయిన ముస్లిములందరూ స్వర్గానికి వెళతారని మహమ్మదుకు మరో సందేశం వచ్చింది (Pg: 205)


అంతేగాక ముస్లిములందరూ యుద్దం చేయడం మాత్రమే కాకుండా యుద్దానికి ధనసహాయం కూడా చేయాలి. ఈ పన్నును “జాకత్” అని పిలుస్తారు. (ఈ పన్ను ఇప్పటికీ ముస్లిములు ఏదైనా ఒక ముస్లిము సంస్థకు దానం చేస్తారు.) (Pg 204-205)


ఇలా మహమ్మదు ముస్లిములందరినీ ముస్లిమేతరులపై యుద్దానికి సంసిద్దులను చేసాడు. మక్కావాసుల కారావానులపై దాడి బాగా లాభదాయకంగా ఉండడంతో మదీనావాసులలో ముస్లిమేతరులు కూడా దోపిడీ సొమ్ము మీదా ఆశతో మహమ్మదుతో పాటు వెళ్ళేవారు. ముస్లిమేతరులు ముస్లిములతో కలిస్తే వెంటనే మహమ్మదు వారిని ఆపి వారు ముస్లిములుగా మారితే తప్ప దాడికి రాకూడదని చెప్పేవాడు. దాంతో అప్పటికప్పుడు వారు తమ మతాన్ని మార్చుకొని ముస్లిములుగా మారేవారు. అలా మహమ్మదు అనేకులను ముసిములుగా మార్చగలిగాడు. అలా రెండు మూడు సంవత్సరాలలో మదీనా మొత్తం మహమ్మదు అధికారంలోకి వచ్చింది (Pg: 206).

వనరు: Life Of Mahomet, William Muir, Printed 1891.
(వచ్చేవారం బద్ర్ యుద్దం)

9 comments:

ravi ravanna said...

oka pravakta devuni duta ayeina manishi karavanu lapie dadulu cheyadam antay dopidi donga tanam kindha radha
bagundi continue cheyandi

ఇస్లాం - కొన్ని నిజాలు said...

మీరు ఇలా ప్రోత్సహిస్తే సంతోషం.

కిరణ్ said...

అజ్ఞానులు వారి కంటే కొంచెం ఎక్కువగా తెలిసినట్లు..నాయకునిలా మాట్లాడే వారికి విలువ ఇస్తారు... అప్పటి రోజుల్లో అక్కడి వారి పరిస్థితులు చీకటి వంటివి.. సో... అప్పటికప్పుడు తిండి పెట్టే.. వాడే దేవుడి లా కనిపిస్తాడు.... ఏ కారణం లేకుండా కేవలం కడుపు నింపు కోడానికి ఇతరులను చంపితే ... అదొక దొంగల ముఠా. .. ఐతే... ఇప్పటి రొజు ముస్లిం లకు ..మన హిందువుల లా ..ఇస్లాం చరిత్ర పై అంతగా పరిజ్ఞానం లేదా మరి... ????

ఇస్లాం - కొన్ని నిజాలు said...

నిజం చెప్పాలంటే లేదు మరి. ముస్లిములలో తొంభై శాతం మందికి తమ మతంలో నిజంగా ఏముందో తెలియదు. కేవలం పది శాతం మందికి మాత్రమే తెలుసు. వారిలో తొంభై శాతం మంది తాము మతాన్ని వాడుకొని ఇతరులను control చేస్తారు. మిగిలిన పది శాతం మంది ముస్లిములను మార్చుదామని ప్రయత్నిస్తే (ఉదా: తస్లీమా నస్రీన్ వంటి వారు), మిగిలిన వారు వారిని చంపుతామని బెదిరిస్తారు.

ravi ravanna said...

sir meru mahmed garu karavanulu oie dadi chesaru anutunnaru adhi oka rajam inkoka rajyam pi chesey dadi la yendhuku chudakudadu adhi dopidi avutundha

varamulo badhar yuddham annaru 2 varalu ayeindhi inka ledhu

కాయ said...

దారిన పోయె వాల్లని దోచుకోవడం.. దారి దొపిడి... ఎదుతి వాడికి తెలియకుందా వాది వస్తువులు తీయటం, మోసం చేయాలనె ఉద్దెశ్యం ఉంటే అది దొంగతనం.. మెథా శక్తి తో గెలవడం ఉత్తమమైనది... యుద్ధానికి సిద్ధం గా ఉన్న వాళ్ళతో యుద్ధం దోపిడి కాదు.. నిస్సహాయుల పై యుద్ధం దొపిడి... యుద్ధం చేయలేని వాళ్ళు సామంతులు ... కప్పం (టాక్స్) కడతారు... అంతే..

ఇది నా అభిప్రాయం...

Unknown said...

hello
sir next post eppudu
meru khoram mottam chedivara.

ఇస్లాం - కొన్ని నిజాలు said...

రవి రవన్నగారూ,
ఆ దాడులను ఒక రాజ్యం మరో రాజ్యం మీద దాడిగా ఎందుకు చూడకూడదంటే అప్పటి అరేబియాలో రాజ్యాలు లేవు కాబట్టి. ఒక పట్టణంలో ప్రజలు తమను తాము పాలించుకునేవారు. ఆ పట్టణంలో ఒక గొప్ప కుటుంబీకులు తమ వర్గంవారిని, మరో కుటుంబీకులు మరో వర్గంవారిని చూసుకునేవారు. వారు అందరూ ఇతర దేశాలతో నడిచే వాణిజ్యంపై ఆధారపడి జీవించేవారు. అప్పటి ప్రజలు తమకు ఒక రాజు కావాలని అనుకోలేదు. అబ్రాహా ఆ విషయం గురించి అడిగినా కూడా వారు వద్దన్నారు. ఈ మధ్యనే ఒక అరబిక్ ఓడను సోమాలియాలో సముద్రపు దొంగలు అపహరించారు. అది అరేబియా దేశం మీద సోమాలియా చేసిన దాడి అనగలమా?
కొన్ని వ్యగ్తిగత కారణాల వల్ల మార్చిలో టపాలు ఉండవు. మళ్ళీ పునర్దర్శనం ఏప్రియల్ లోనే.

@హఫీజ్, నేను ముస్లిము ఆచారాల గురించి పరిశోధించాను. అవి పూర్తిగా హాడిత్ లలో ఉన్నాయి. అందువల్ల నేను ఇబ్న్ హిషామ్, తబరి, బుఖారిలను చదివాను. మహమ్మద్ జీవిత చరిత్ర సిరాను కూడా చదివాను. ఖురాను తప్ప మిగిలిన అన్ని ముస్లిము పవిత్ర గ్రంథాలను చదివాను.
అందరికీ సులభంగా అర్థమవుతుందని william Muir గారి పుస్తకాన్ని ఎన్నుకున్నాను.

Unknown said...

mee islam gurinchi emi teliya nappudu daani gurinchi matlade arhata ledu