Sunday, January 25, 2009

మహమ్మదు జీవితం – 3

(నేను వ్రాస్తున్న టపాలు చదివి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న బ్లాగు సందర్శకులకు నెనర్లు.)
జరిగిన కధ: మహమ్మదుకు పెళ్ళయి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు పుడతారు. కాని పాపం అదృష్టం లేక అతని ఇద్దరు కొడుకులు చనిపోతే జయీద్ అనే ఒక బానిసను కొడుకుగా దత్తత తీసుకుంటాడు. తనను పెంచిన తాలిబు కొడుకయిన ఆలీని కూడా తన దగ్గరే పెంచుకుంటాడు. అలా మహమ్మదుకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు అతని జీవితం సాఫీగానే సాగిపోయింది. ఇక చదవండి.
అలా మహమ్మదు నలభై సంవత్సరాలవయస్సుకు దగ్గరయినప్పుడు కవితలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి మహమ్మదు హఠాత్తుగా పడిపోయి మాట్లాడుతూ ఉండేవాడు. కొన్నాళ్ళు మక్కా పట్టణానికి దగ్గరగా ఉన్న కొండలు, గుహలవద్దకు ఎక్కువగా వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అలా గుహలలో రోజులతరబడి గడిపేవాడు. ఒకసారి అలా కొండలలో తిరుగుతుండగా మహమ్మదుకు ఒక వెలుగు కనిపించింది. అలా ఆ వెలుగులో కనిపించింది దైవదూత గేబ్రియేల్ (Gabriel. ఖురానులో జిబ్రీయెలు అని చెప్పడం జరిగింది. అది హీబ్రూ భాషనుండి అరబిక్ భాషకు మారినందున జరిగిన మార్పు అని గమనించాలి) అని సురాలో చెప్పబడింది. ఇది మొదట మహమ్మదు కూడా నమ్మలేదు. తన భార్య అయిన ఖదీజాకు చెబితే ఆమె మొదట భూతవైద్యులను పిలిపించి, మహమ్మదుకు వైద్యం చేయించింది.(Muir – 49). కానీ మహమ్మదుకు ఇంకా వెలుగు కనబడడం, మాటలు వినబడడం ఆగలేదు. ఇలా మాటలు వినబడడం (దీనినే సందేశమని (Revealation) ముస్లిములు నమ్ముతారు) ఎప్పుడు జరుగుతుందో మహమ్మదుకు కూడా తెలియదు. ఒక్కోసారి ఆరు నెలలనుంచి మూడు సంవత్సరాలవరకు కూడా మాటలు వినబడేవి కాదు. (Muir-49) ఇలాంటి సమయంలో తనకు వస్తున్నవి నిజంగానే సందేశాలేనా అని మహమ్మదు కూడా సందేహం వచ్చింది (Muir 50,51). ఒకవేళ అవి నిజంగా సందేశాలే అయితే అవి దైవం నుంచి వస్తున్నవా లేక సైతాను నుంచి వస్తున్నవా అని ఇంకో సందేహం వచ్చింది. ఇలాంటి సమయంలో ఖదీజా చేసిన పనులను మనం చెప్పుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది. ఖదీజా తన భర్తను సైతాను పీడిస్తున్నాడేమోనని ఒక రోజు అనుమానంతో మహమ్మదు ఇలా నిద్రలో చెబుతున్నప్పుడు మొదట తన కుడి తొడ మీద అతనిని కూర్చోబెట్టుకుంటుంది. మహమ్మదు ప్రవర్తనలో ఏ మార్పులేకపోవడంతో తన ఎడమతొడమీద కూర్చోబెట్టుకుంది. అప్పటికీ మహమ్మదు ప్రవర్తనలో ఎలాంటి మార్పూలేకపోయేసరికి తన బట్టలన్నీ విప్పదీసింది. అప్పుడు మహమ్మదు అలా మాటలు చెప్పడం మానేసాడు. దానితో తన భర్తకు ఏ దయ్యమూ సోకలేదని ఖదీజా నిర్ణయించుకొంది. (Muir – 50)
ఒకసారి మహమ్మదు తనకు దైవదూత కనబడడం లేదని అలా కొండలమీదకు ఆత్మహత్య చేసుకుందామని (Muir 50) వెళ్ళి పోతే ఒక హస్తం అతన్ని ఇంటికి తీసుకువస్తుంది. అది దైవదూత అని ముస్లిములు అభిప్రాయం, కాని సురాలలో అలా చెప్పలేదు. ఇంటిలో మానసికంగా క్రుంగిపోయిన భర్త కనబడడం లేదని తన పనిమనుషులను ఖదీజా మహమ్మదును వెతకడానికి పంపితే వారు అతనిని ఇంటికి తీసుకువస్తారు. (Muir 50) ఇక అప్పటి నుంచి దైవం నుంచి మహమ్మదుకు సందేశాలు వరుసగా వస్తాయి. ఇలా సందేశాలు వస్తున్నప్పుడు మహమ్మదు నేలమీద జీవంలేకుండా పడిపోయి ఉండేవాడు, లేదా నిద్రపోతూ ఉండేవాడు. ఎంత చలికాలమైనా మహమ్మదుకు సందేశం వస్తున్నప్పుడు నుదుటిమీద తీవ్రమయిన చమటతో తడిసిపోయేవాడు. ఇలా సందేశం వచ్చినప్పుడు తీవ్రమైన వేగంతో గాలి పీలుస్తూ ఉండేవాడు. (Muir -51)
సందేశం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అడిగితే మహమ్మదు “సందేశం నాకు రెండు రకాలుగా వస్తుంది. కొన్నిసార్లు దైవదూత అయిన గేబ్రియేలు స్వయంగా నాతో మాట్లాడేవాడు. అది ఇతర వ్యక్తితో మాట్లాడినట్లు బాగానే ఉంటుంది. కాని కొన్నిసార్లు నాకు చెవుల్లో గంటలు మ్రోగుతున్నట్లు, ఆ శబ్దం నా గుండెలను తాకుతున్నట్లు ఉండేది. నాకు కాస్త ఇబ్బంది పెట్టేది ఇది”, అని చెప్పాడు. (Muir – 51)
Muir = Life of Mahomet – William Muir. పక్కన ఉన్న అంకె ఆ సంఖ్య పేజీలో నేను చెప్పినది కనబడుతుంది.
(నేను ఈ టపాలో వ్రాసినది చాలా మందికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు. నేను తప్పు వ్రాస్తున్నాని అనుకోవచ్చు. మరోసారి మనవి చేస్తున్నాను నేను వ్రాస్తున్నది పైన చెప్పిన పుస్తకం నుంచి. ఆ పుస్తకం వ్రాసినది William Muir. ఆ పుస్తకాని 1890లో వ్రాసాడు. ఆ పుస్తకాన్ని గూగులమ్మ ఉచితంగా అందిస్తుంది. నేను తప్పు చెబుతాననుకునేవాళ్ళు ఆ పుస్తకం చదువుకోగలరని ఆశిస్తూ……)
సశేషం.

Thursday, January 22, 2009

పాలస్తీనా - దాని చరిత్ర

ఒక్కసారి మనం పాలస్తీనా గురించి దాని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. భౌగోళికంగా పాలస్తీనా ఇస్రాయేలు రెండూ కూడా కలిసిపోయి ఉంటాయి. దీని కన్నా ముందు మనం ఒక్కసారి కొంచెం చరిత్రలో వెనక్కు వెళ్ళి వద్దాం. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. మహమ్మదు ఇక్కడ ఉన్న ఆల్ అక్సా మసీదు నుండి స్వర్గానికి ఎగిరి వెళ్ళాడని ఖురానులోనూ, సిరాలోనూ, అనేక హాడిత్ లలో చెప్పబడియున్నది. (చారిత్రకంగా చూస్తే ఈ ఆల్ అక్సా మసీదు రెండవ క్యాలిఫు (Second Caliph) కట్టించాడు, జెరూసలేమును ముస్లిములు ముట్టడించేటప్పటికి మహమ్మదు చనిపోయాడు.) ఇందువల్ల జెరూసలెము ఈ మూడు మతాలవారికి కావలసిన పట్టణం.

ఇప్పుడు మతాలలో నుంచి చరిత్రలోకి వస్తే రెండవక్యాలిఫు జెరూసలెమును ఆక్రమించుకోకముందు అందులో క్రైస్తవులు, యూదులు ఉండేవారు. ఎప్పుడైతే ముస్లిములు ఆక్రమించుకొన్నారో ఇక అప్పటినుంచి యూరపులోని క్రైస్తవులు, ముస్లిముల మధ్య యుద్దాలు మొదలయ్యాయి. ఈ జెరూసలేము పట్టణం కొన్నాళ్ళు ముస్లిముల ఏలుబడిలో మరికొన్నాళ్ళు క్రైస్తవుల ఏలుబడిలో కొనసాగింది. ఈ పట్టణాన్ని ముస్లిములచెరనుండి కాపాడటానికి ఐరోపాలో క్రూసేడులు మొదలయ్యాయి. మొత్తం మీద ఇలా అందరూ కొట్టుకుంటూ పదమూడవశతాబ్దం వచ్చేసరికి ఇది ముస్లిములచేతిలో స్థిరపడిపోయింది. ఇన్ని యుద్దాలను తట్టుకోలేక అక్కడ ఉన్న యూదుప్రజలు కాస్త యుద్దాలు తక్కువగా ఉండే యూరపుకు తరలివెళ్ళిపోయారు.
మనం చరిత్రలో కాస్త ముందుకు వస్తే రెండవ ప్రపంచయుద్దంలో మనకు ఎంత మంది యూదులు ప్రాణాలు కొల్పోయారో తెలుసు.(సుమారుగా ఆరుమిలియనులమంది అంటే అరవైలక్షలమంది అని ఒక అంచనా. ప్రపంచచరిత్రలో ఇంతకన్నా భయంకరంగా ఒక వర్గానికి చెందిన ప్రజలను చంపడం ఇదే మొదటకాకపోయినా, ఇంతకన్నా ఎక్కువమంది చనిపోయినా యూదులకు వచ్చినంత పేరు మరింకెవ్వరికీ ఎందుకు రాలేదో నాకు తెలియదు.) రెండవ ప్రపంచయుద్దం ముగిసేసరికి యూదులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని అప్పటి అగ్రరాజ్యాలన్నీ(అందులో అమెరికా పాత్ర కాస్త ఎక్కువ అన్నమాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి) కలిసి నిర్ణయించాయి. ఇందుకు ఎక్కడ ప్రదేశం కోసం చూస్తుంటే, ప్రపంచంలో ఖాళీ ఎక్కడా లేనట్లు యూదులకు పుట్టినిల్లయిన జెరూసలేములో ఏర్పాటు చేసారు అదీ దానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిము దేశాలని తెలిసికూడా. దీనికి కొంత పక్కనే ఉన్న గాజాలో భూమిని కూడా ఇజ్రాయేలు అప్పుడప్పుడు తనలో కలిపేసుకుంటోంది. ఇది ఇప్పటిదాకా జరిగిన కధ.
ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్ని. ఇల్లు(ఇజ్రాయేలు) ఒకప్పడు యూదులకు చెందినది. తరువాత యుద్దాలను తట్టుకోలేక యూదులందరూ పక్కింటికి(యూరపుకు) వెళ్ళారు. ఇల్లు ఖాళీగా ఉందని పొరుగింటివాళ్ళు వచ్చికుదురుకున్నారు. సమయం రాగానే ఇంటియజమాని వచ్చాడు, గొడవ మొదలయ్యింది. ఇక్కడ మనం మఖ్యంగా చెప్పుకోవలసినది అప్పటి అమెరికాను. చుట్టుపక్కల అన్నీ ముస్లిము దేశాలే. ఎవ్వరూ అలా చేయడానికి ఒప్పుకోరు. కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, రష్యాలో చాలా ప్రజలు ఉండగలిగినదానికన్నా చాలా అధికస్థలం ఉన్నది. మళ్ళీ అక్కడ ఎవరూ శత్రువులు ఉండరు. కానీ ఇవి అన్నీ కాదని అంతమంది శత్రువుల మధ్యలో దేశాన్ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయేలు-పాలస్తీనాలో మొత్తం జనాభా కలిపితే కోటి మంది అనుకున్నా, ముస్లిములను ముస్లిము దేశాలు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు. పది దేశాలు పది లక్షలచొప్పున పంచుకుంటే చప్పున సమసిపోయే సమస్య ఇది. కానీ ఎవ్వరూ ఆలోచించరు. కనీసం యూదులకు రెండవప్రపంచ యుద్దంలో జరిగినది చూసిన తరువాత ముస్లిము దేశాలు కొంతమంది ముస్లిములను తమ దేశంలోకి రానిస్తే అస్సలు గొడవ ఉండదు. ఇజ్రాయేలు కూడా ముస్లిములను వారి మసీదును దర్శించుకనే, నిర్వహించుకునే అవకాశాలు వారికే ఇస్తే ఇవ్వాళ పాలస్తీనాలో ఎవ్వరూ చనిపోరు.
తమ భూభాగంలోకి ముస్లిములను ఏ ఇతరముస్లిము దేశాలు అంగీకరంచడంలేదు. ఇది తమ భూభాగమని ముస్లిముసంస్థలు తీవ్రవాద కార్యకలాపాలతో అమాయక ప్రజలను చంపుతారు. దీనికి ప్రతిగా ఇజ్రాయేలు(మనలాగా చేతగాని దేశం కాదు కాబట్టి) ఇలా అప్పుడప్పుడూ పక్క దేశాలకి షికారు వెళ్ళినట్లు దాడులు చేస్తుంది. ఇవి అన్నీ అగ్రరాజ్యాలు ఆడుతున్న కుట్రలు, దీనిలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం సామాన్యులు. వీటి గురించి వ్రాసి మనకు చేతులు నొప్పులు.

Monday, January 19, 2009

మహమ్మదు జీవితం – రెండవ భాగం

(జరిగిన కథ: మహమ్మదు పుట్టకముందే తండ్రిని పోగొట్టుకుంటాడు. పుట్టిన తరువాత ఇద్దరు తల్లులు అతనికి పాలు ఇస్తారు. ఆరేళ్ళ వయస్సులో తల్లిని, ఎనిమిదేళ్ళ వయస్సులో తండ్రిలాంటి తాతను పోగొట్టుకుంటాడు. అతనికి అయిదేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి Fits of Epilepsy వస్తాయి. మహమ్మదును అతని పెదనాన్న పెంచుకుంటాడు. అతను పన్నెండేళ్ళవయస్సప్పుడు సిరియా వెళతాడు. ఇక చదవండి. మహమ్మదు యొక్క జీవితం రెండవ భాగం ఈ టపాలో వివరిస్తాను. పాత టపాను ఇక్కడ చూడవచ్చు.)
మహమ్మదు అలా సిరియా పర్యటనలో క్రైస్తవం గురించి మరియు యూదు మతం గురించి అనేక విషయాలు తెలుసుకుంటాడు. AD 580 నుండి 590 వరకు మహమ్మదు జీవితంలో చెప్పుకోదగ్గ విషయాలు లేవు. కాని ఈ సమయంలో మక్కాలో తెగల మధ్య యుద్దాలు బాగా జరిగాయి. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలు వయస్సు వచ్చాయి. అప్పుటికి అబూ తాలీబు కాస్త ముసలివాడయ్యాడు. అతని సంపాదన పెరగకపోగా ఇంటిలో ఖర్చులు మాత్రం పెరగసాగాయి. అప్పుడు తాలీబు మహమ్మదును ఖదీజా అనే బాగా ధనవంతమైన మహిళ వద్ద పనికి కుదిర్చాడు. మహమ్మదు ఖదీజాకు చెందిన ఒంటెలసమూహంతో మరొకసారి సిరియా పయనమవుతాడు. ఈ సారి మహమ్మదు సిరియా పర్యటన విజయవంతమవుతుంది. తన యజమానురాలికి బాగా లాభం చేకూర్చేలా అనేక భేరసారాలు మహమ్మదు చేస్తాడు.
సిరియా పర్యటన ముగిసిన తరువాత అందరికంటే ముందు వచ్చి తన యజమానురాలికి తన పర్యటన యొక్క పూర్తి వివరాలు తెలిపి మహమ్మదు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఖదీజా గురించి కొంచెం చెప్పుకోవాలి. ఖదీజా మహమ్మదు వలె ఖొరేషియా తెగకు చెందిన మహిళ. ఆమె వయస్సు నలభై సంవత్సరాలు. అప్పటికే ఇద్దరు మగవాళ్ళతో పెళ్ళయి వారు ఇద్దరూ చనిపోవడంతో ఆమె విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు పాత వివాహాల ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. పాతవివాహాల ద్వారా ఆమెకు చాలా సంపద కలిసివచ్చింది. ఇవి చూసి ఆమెకు అనేక మంది డబ్బున్న మగవాళ్ళు వివాహాన్ని ప్రతిపాదించినా ఆమె వారందరినీ తిరస్కరించి ఒంటరి విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెకు మహమ్మదు తారసపడ్డాడు. ఆమె అప్పుడు మహమ్మదు మీద మనస్స్ పడింది. (Muir Pg:22).
అప్పుడు ఆమె తన పనిమనిషి ద్వారా మహమ్మదును పెళ్ళాడాలనే తన మనస్సులోని మాటను మహమ్మదుకు చేరవేసింది. అందుకు మహమ్మదు అంగీకరించాడు. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలవయస్సున్నప్పుడు నలభై సంవత్సరాల వయసున్న ఖదిజాతో వివాహం జరిగింది. మహమ్మదుకు ఖదీజా ద్వారా ఇద్దరు మగపిల్లలు, నలుగురు అడపిల్లలు కలిగారు. మహమ్మదు తొలి బిడ్డ పేర్ ఖాసీం. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం మహమ్మదును అనేక సందర్భాలలో అబుల్ ఖాసీం (ఖాసీం యొక్క తండ్రి) అని సంబోదించడం మనం అనేక సురాలలో, ఖురానులో అనేక భాగాలలో గమనించవచ్చు. కానీ మహమ్మదుకు ఇక్కడ కూడా దురదృష్టం వదలలేదు. అతని మొదటి కొడుకు రెండు సంవత్సరాలలో చనిపోతే అతని ఆఖరి కొడుకు (ఖదీజా వలన కలిగిన) నెలలవయస్సులోనే చనిపోయాడు.
ఇవి కాక ఇంకా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరుగలేదు. మహమ్మదు జయీద్ అను పేరు గల ఒక బానిసను కొడుకుగా దత్తతచేసుకుంటాడు. తనను పెంచిన తాలీబు యొక్క కుమారుడైనటువంటి ఆలిని తెచ్చి పెంచుకుంటాడు.

Bibliography
Muir = Life of Mahomet – William Muir

Monday, January 12, 2009

మహమ్మదు జీవితం – 1

ఈ భాగంలో మహమ్మదు పుట్టుకకు ముందు అరేబియాలో పరిస్థితులగురించి, మరియు బాల్యం గురించి వివరిస్తాను (నేను పూర్తిగా Life of Mahomet – William Muir పుస్తకంలో నుంచి వ్రాస్తాను). నేను చదివిన పుస్తకం వ్రాసిన ముయిర్ ఖురాను, హాడిత్ (ఇబ్న్-ఇషాఖ్, ఆల్-తబరి, ఇబ్న్-హిషామ్), సిరా (మహమ్మదు యొక్క జీవిత చరిత్ర), మరియు అప్పటి కవితలలో నుంచి అన్నింటినీ కూర్చి వ్రాశాడు కాబట్టి, మరియు ఇది వ్రాసి దాదాపు వంద సంవత్సరాలు దాటింది కాబట్టి మనం నిస్సందేహంగా రచయితను నమ్మవచ్చు. రచయిత పూర్తిగా నిస్సందేహంగా (దొరికినంతలో) వ్రాశాడనటానికి సాక్ష్యం. ఇది వ్రాసిన తరువాత రచయిత ఖురానులో నుంచి కొన్ని మంచి మాటలను కూర్చి ఒక చిన్న పుస్తకంగా(Minibook) రూపొందించాడు.
మహమ్మదు పుట్టుటకు ముందు అరేబియా దాని పరిసరాలగురించి కొంచెం మాట్లాడుకోవడం మంచిది. అప్పటి అరేబియాలో ఎన్నో తెగలు నివసిస్తుండేవి. అప్పటి అరేబియాలో చెప్పుకోదగ్గ పట్టణాలు రెండు. అవి మక్కా, మదీనా (అప్పటి వ్రాతలలో యాత్రిబ్ అని పిలిచేవారు). అరేబియా అత్యధికభాగం ఎడారితో కప్పబడి ఉండేది. మహమ్మదు పుట్టుకముందు కూడా అరేబియా ప్రాంతంలో చెప్పుకోదగ్గ చరిత్ర కానీ, రాజులు గానీ ఎవరూ లేరు. అరేబియావాసులగురించి చరిత్ర మీద అక్కడక్కడా కొన్ని చోట్ల కనబడేది. అరేబియాలో ఏమీ పండకపోయినా, వ్యాపారమార్గాలన్నీ ఎక్కువగా అరేబియా మీదుగా వెళ్ళేవి. అందువల్ల ఇక్కడ పండటానికి ఏమీ లేకపోయినా వ్యాపారం ద్వారా, మరియు వ్యాపారులకు సదుపాయాలు కల్పిస్తూ అరేబియా వాసులకు జీవనం జరిగిపొయేది. ఇది కాక మరొక ప్రముఖమైన ధనసహాయం మరొక విధంగా ఉండేది. మక్కాలో ఉన్న కాబా గుడికి ప్రతీ సంవత్సరం యాత్రికులు, భక్తులు వచ్చేవారు. వారిద్వారా కొంత ఆదాయం సమకూరేది. కాబాగుడిలో ప్రధాన దేవునిపేరు అల్లా. అల్లా అంటే చంద్రదేవుడు.అల్లా కాకుండా ఇంకా 360 ఇతర దేవుళ్ళ విగ్రహాలు కాబాగుడిలో వుండేవి. కాబాను విచ్చేసిన యాత్రికులు నగ్నంగా గాని, మక్కావాసులు ఇచ్చిన బట్టలు కప్పుకొని గాని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అంతేగాక జంతుబలులు కూడా జరిగేవి. ఇది మక్కాలో మహమ్మదు పుట్టుకకు ముందు పరిస్థితి.
ఈ సమయంలో మక్కాలో ఉన్న సామాజిక పరిస్థితులను ఒక్కసారి గమనిద్దాం. మక్కాలో కొరేషియా (Coreishite) , ఒమయ్యా అనేవి రెండు బలమైన వంశాలు. చరిత్రగురించి పక్కన పెట్టి ఒక్కసారి మనం దగ్గర చరిత్రను గమనిస్తే కొరేషియా వంశానికి చెందిన అబూ ముత్తాలిబ్ ను ఈజిప్టు రాజు మక్కా పెద్దగా అంగీకరిస్తాడు. అందుకు అబూ ముత్తలిబ్ కాబాగుడికి వచ్చే యాత్రికులకు సదుపాయాలను సమకూర్చాలి. అందుకు అందరూ అంగీకరించారు. అబూ ముత్తాలిబ్ తరువాత అబ్ద్ ఆల్ ముత్తాలిబ్ ఈ పనికి నియుక్తుడైనాడు. ఇతనికి పుట్టిన కొడుకలలో చిన్నవాడి పేరు అబ్దుల్లాహ్. ఈ అబ్దుల్లాహే మన మహమ్మదుకు తండ్రి. మహమ్మదు పుట్టుటకు ముందు సరిగ్గా ఆ సంవత్సరంలోనే అబిస్సీనియను దేశానికి చెందిన యెమెనును పాలించే సామంతరాజు అయిన అబ్రాహా అరేబియాను ముట్టడించాడు. అతను ఒక బలమైన ఏనుగు ఎక్కి వచ్చినందున ఆ సంవత్సరాన్ని ఏనుగుసంవత్సరమని(Year of Elephant) పిలుస్తారు. అబ్రాహా కేవలం కాబాగుడిని ధ్వంసం చేయడానికి మాత్రమే ఈ దండయాత్ర మొదలుపెట్టాడు. కాని అది పూర్తిగా విజయవంతం కాలేదు. ఖురాను ప్రకారం కొరేషియాతెగ పెద్దలు కాబా దేవుడిని మొక్కి యుద్దానికి వెళితే ఆ యుద్దంలో శత్రువులు ఎక్కువగా వ్యాధులబారినపడి మృతిచెందారు. అందుకే కాబాగుడికి ఆ సంవత్సరం బలులు ఇచ్చారు. అబ్దుల్లాహ్ కు అప్పటికే అమీనా అనే అమ్మాయితో పెళ్ళయిఉంది. అతను ఆ తెగ ఆచారలప్రకారం పెళ్ళి అయినవెంటనే మూడురోజులు అత్తవారింట గడిపి వ్యాపారం పని మీద గాజా వెళతాడు. కాని అక్కడ రోగం బారినపడి తిరిగి తనస్వంత ఊరు చేరకుండానే మృతిచెందుతాడు. అప్పటికి మహమ్మదు తన తల్లి కడుపులో ఉన్నాడు. మహమ్మదుకు అతని తండ్రి నుంచు వారసత్వంగా వచ్చిన ఆస్తి అయిదు ఒంటెలు, గొర్రెలమంద ఒకటి, ఒక బానిసఅమ్మాయి ఒమ్మ్ అయిమన్(Omm Ayman). ఒక బానిసను కలిగిఉండటం అప్పటి అరేబియా లెక్కలప్రకారం కాస్త ధనవంతులకిందే లెక్క్.
తన తండ్రి చనిపోయిన తరువాత, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అబ్రాహా యొక్క యుద్దం ముగిసిన 55 రోజుల తరువాత మహమ్మదు పుట్టాడు. అనేక మంది చరిత్రకారులు ఈ సంవత్సరం 570 AD అని అంగీకరించారు కాబట్టి ఈ విషయంలో మనకు ఎట్టి సందేహం అవసరం లేదు. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం సంపన్న కుటుంబాల వారు తమ బిడ్డలకు తాము పాలివ్వరు. ఇలా పాలిచ్చేందుకు వేరే వాళ్ళకు అప్పగిస్తారు. మొదట మహమ్మదుకు థీబా(Thieuba) అనే మహిళ పాలిచ్చింది. తరువాత బాని సయిద్ కు చెందిన వారు కొంతమంది స్త్రీలు వచ్చాక కాస్త కష్టం మీద అమీనా హలీమా అనే ఒక మహిళకు మహమ్మదును ఇవ్వగలుగుతుంది. హలీమా మహమ్మదుకు తన స్వంత బిడ్డతో పాటు రెండుసంవత్సరాలు పాలిచ్చింది. తరువాత అతని తల్లి దగ్గిర వదిలి వెళ్ళింది. కాని ఈ సమయంలో ఒక చిత్రమయిన విషయం జరిగింది. మహమ్మదు ఒక్కోసారి ఆటలాడుకుంటున్న సమయంలో ఎపిలెప్సీ వల్ల ఫిట్స్ (Fit of epilepsy) వచ్చిపడిపోయేవాడు. ఇది హలీమాను కాస్త కలవరానికి గురిచేసింది. హలీమా వెంటనే అమీనా దగ్గరకు తీసుకువెళ్ళింది. అమీనా పూర్తిగా విషయం కనుక్కొని ఇందులో కంగారు పడవలసింది ఏమీలేదని చెప్పి తిరిగి హలీమాకే అప్పగించింది. ఆ విధంగా హలీమా మహమ్మదును తన బిడ్డ కన్న ఎక్కువగా ప్రేమించేది. అలా మహమ్మదుకు అయిదు సంవత్సరాలు వచ్చేదాకా పెంచిన హలీమా తిరిగి అదే రోగం మళ్ళీ ఎక్కువగా వస్తుండడంతో భయపడి అమీనాకు అప్పగించివెళ్ళింది. అమీనా ఒక సంవత్సరం మహమ్మదును పెంచిన తరువాత అతని తాత అయిన ముత్తాలిబు వద్దకు తీసుకువెళ్ళింది. కాని దారి మధ్యలోనే ఆమె కన్నుమూసింది. మహమ్మదును బానిస అమ్మాయి అతని తాతగారింటివద్ద వదిలిపెట్టింది.
అబూ ముత్తాలిబ్ తన కోడలి మరణానికి ఎంతో బాధపడ్డా తన మనవడినే కుమారుడి వలే పెంచుకొనేవాడు. ముత్తాలిబ్ మహమ్మదును ఎంతో ప్రేమగా చూసుకొనేవాడు. తనతో బాటు అన్నం తినిపించేవాడు, తన పక్కనే పడుకోబెట్టుకొనేవాడు. కానీ మహమ్మదుకు ఆ అదృష్టం ఎంతో కాలం నిలువలేదు. అతను ఎనిమిది సంవత్సరాల వయసుండగా అబు ముత్తాలిబ్ మరణించాడు. చిన్ని మహమ్మదుకు ఇది నిజంగా ఒక చేదు వార్త. అప్పటినుంచి మహమ్మదు యొక్క ఆలనాపాలనా చూసే బాధ్యత అంతా అతని పెదనాన్న అయిన అబూ తాలిబు మీద పడింది. అబూ తాలిబు ఏనాడూ మహమ్మదును బరువుగా అనుకోలేదు. తన స్వంతకుమారుడి వలే పెంచుకొనేవాడు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఖురాను మనకు తాలిబు యొక్క ఇతరకుటుంబ సభ్యులు మహమ్మదు ఎడల ఎలా ప్రవర్తించారో చెప్పలేదు. కాని తాలిబు చాలా పేదవాడని మాత్రం చెప్పాయి. దీనిని బట్టి తాలిబు ఇంట్లో ఆడవారు మహమ్మదును సరిగా చూడలేదని చెప్పవచ్చు కాని దీనికి ఆధారాలు మాత్రం లేవు. ఒక విధంగా మహమ్మదును అతని తాత, మరియు పెదనాన్న చాలా ప్రేమగా చూసుకొన్నా ఆడవాళ్ళసంగతి మనకు తెలియదు. వారు మహమ్మదును సరిగా చూడలేదని మనం మరో విషయాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. అది మహమ్మదుకు పన్నెండు సంవత్సరాలు వయసప్పుడు జరిగిన సంఘటన. తాలిబు సిరియాకు వ్యాపారపనిమీద బయలుదేరుతుండగా హటాత్తుగా మహమ్మదు వచ్చి ఒక ఒంటె మీద ఎక్కి కూర్చుంటాడు. తాలిబు కూడా పన్నెండేళ్ళ కుర్రవాడని తెలిసికూడా సిరియాకు తనతో పాటు తీసుకువెళతాడు. కాబట్టి మహమ్మదుకు ఆడవాళ్ళనుంచి ఎక్కువ బాధలే ఉండేవని చెప్పవచ్చు. కాని మనం అతని ఇంట్లో ఆడవారిని కూడా అనలేము. అందుకు కారణం పేదరికం. సిరియా వెళ్ళిన మహమ్మదు అక్కడ ఉన్న అనేక చారిత్రక అవశేషాలను చూసి వాటి ద్వారా క్రైస్తవం మరియు యూదు మతం యొక్క చారిత్రక విశేషాలు తెలుసుకుంటాడు.
(సశేషం)
మనం ఇంతవరకు మహమ్మదు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అతను పుట్టకముందే తండ్రిని కోల్పోయాడు, ఇద్దరు తల్లులు పాలిచ్చినా కన్నతల్లి మాత్రం పాలివ్వలేదు. కన్నతల్లిని కలిసిన ఒక్క సంవత్సరంలోనే ఆమె చనిపోయింది. మొట్టమొదటి తండ్రిలాంటి వ్యక్తి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. తరువాత మరో వ్యక్తి తండ్రిలా ఉన్నా అతని తరపున ఆడవారి ప్రవర్తన ఏమంత బాగాలేదు. ఇవి అన్నీ పుట్టిన కేవలం పన్నెండేళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు. మిగతా తరువాయి టపాలో.