Sunday, January 25, 2009

మహమ్మదు జీవితం – 3

(నేను వ్రాస్తున్న టపాలు చదివి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న బ్లాగు సందర్శకులకు నెనర్లు.)
జరిగిన కధ: మహమ్మదుకు పెళ్ళయి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు పుడతారు. కాని పాపం అదృష్టం లేక అతని ఇద్దరు కొడుకులు చనిపోతే జయీద్ అనే ఒక బానిసను కొడుకుగా దత్తత తీసుకుంటాడు. తనను పెంచిన తాలిబు కొడుకయిన ఆలీని కూడా తన దగ్గరే పెంచుకుంటాడు. అలా మహమ్మదుకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు అతని జీవితం సాఫీగానే సాగిపోయింది. ఇక చదవండి.
అలా మహమ్మదు నలభై సంవత్సరాలవయస్సుకు దగ్గరయినప్పుడు కవితలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి మహమ్మదు హఠాత్తుగా పడిపోయి మాట్లాడుతూ ఉండేవాడు. కొన్నాళ్ళు మక్కా పట్టణానికి దగ్గరగా ఉన్న కొండలు, గుహలవద్దకు ఎక్కువగా వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అలా గుహలలో రోజులతరబడి గడిపేవాడు. ఒకసారి అలా కొండలలో తిరుగుతుండగా మహమ్మదుకు ఒక వెలుగు కనిపించింది. అలా ఆ వెలుగులో కనిపించింది దైవదూత గేబ్రియేల్ (Gabriel. ఖురానులో జిబ్రీయెలు అని చెప్పడం జరిగింది. అది హీబ్రూ భాషనుండి అరబిక్ భాషకు మారినందున జరిగిన మార్పు అని గమనించాలి) అని సురాలో చెప్పబడింది. ఇది మొదట మహమ్మదు కూడా నమ్మలేదు. తన భార్య అయిన ఖదీజాకు చెబితే ఆమె మొదట భూతవైద్యులను పిలిపించి, మహమ్మదుకు వైద్యం చేయించింది.(Muir – 49). కానీ మహమ్మదుకు ఇంకా వెలుగు కనబడడం, మాటలు వినబడడం ఆగలేదు. ఇలా మాటలు వినబడడం (దీనినే సందేశమని (Revealation) ముస్లిములు నమ్ముతారు) ఎప్పుడు జరుగుతుందో మహమ్మదుకు కూడా తెలియదు. ఒక్కోసారి ఆరు నెలలనుంచి మూడు సంవత్సరాలవరకు కూడా మాటలు వినబడేవి కాదు. (Muir-49) ఇలాంటి సమయంలో తనకు వస్తున్నవి నిజంగానే సందేశాలేనా అని మహమ్మదు కూడా సందేహం వచ్చింది (Muir 50,51). ఒకవేళ అవి నిజంగా సందేశాలే అయితే అవి దైవం నుంచి వస్తున్నవా లేక సైతాను నుంచి వస్తున్నవా అని ఇంకో సందేహం వచ్చింది. ఇలాంటి సమయంలో ఖదీజా చేసిన పనులను మనం చెప్పుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది. ఖదీజా తన భర్తను సైతాను పీడిస్తున్నాడేమోనని ఒక రోజు అనుమానంతో మహమ్మదు ఇలా నిద్రలో చెబుతున్నప్పుడు మొదట తన కుడి తొడ మీద అతనిని కూర్చోబెట్టుకుంటుంది. మహమ్మదు ప్రవర్తనలో ఏ మార్పులేకపోవడంతో తన ఎడమతొడమీద కూర్చోబెట్టుకుంది. అప్పటికీ మహమ్మదు ప్రవర్తనలో ఎలాంటి మార్పూలేకపోయేసరికి తన బట్టలన్నీ విప్పదీసింది. అప్పుడు మహమ్మదు అలా మాటలు చెప్పడం మానేసాడు. దానితో తన భర్తకు ఏ దయ్యమూ సోకలేదని ఖదీజా నిర్ణయించుకొంది. (Muir – 50)
ఒకసారి మహమ్మదు తనకు దైవదూత కనబడడం లేదని అలా కొండలమీదకు ఆత్మహత్య చేసుకుందామని (Muir 50) వెళ్ళి పోతే ఒక హస్తం అతన్ని ఇంటికి తీసుకువస్తుంది. అది దైవదూత అని ముస్లిములు అభిప్రాయం, కాని సురాలలో అలా చెప్పలేదు. ఇంటిలో మానసికంగా క్రుంగిపోయిన భర్త కనబడడం లేదని తన పనిమనుషులను ఖదీజా మహమ్మదును వెతకడానికి పంపితే వారు అతనిని ఇంటికి తీసుకువస్తారు. (Muir 50) ఇక అప్పటి నుంచి దైవం నుంచి మహమ్మదుకు సందేశాలు వరుసగా వస్తాయి. ఇలా సందేశాలు వస్తున్నప్పుడు మహమ్మదు నేలమీద జీవంలేకుండా పడిపోయి ఉండేవాడు, లేదా నిద్రపోతూ ఉండేవాడు. ఎంత చలికాలమైనా మహమ్మదుకు సందేశం వస్తున్నప్పుడు నుదుటిమీద తీవ్రమయిన చమటతో తడిసిపోయేవాడు. ఇలా సందేశం వచ్చినప్పుడు తీవ్రమైన వేగంతో గాలి పీలుస్తూ ఉండేవాడు. (Muir -51)
సందేశం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అడిగితే మహమ్మదు “సందేశం నాకు రెండు రకాలుగా వస్తుంది. కొన్నిసార్లు దైవదూత అయిన గేబ్రియేలు స్వయంగా నాతో మాట్లాడేవాడు. అది ఇతర వ్యక్తితో మాట్లాడినట్లు బాగానే ఉంటుంది. కాని కొన్నిసార్లు నాకు చెవుల్లో గంటలు మ్రోగుతున్నట్లు, ఆ శబ్దం నా గుండెలను తాకుతున్నట్లు ఉండేది. నాకు కాస్త ఇబ్బంది పెట్టేది ఇది”, అని చెప్పాడు. (Muir – 51)
Muir = Life of Mahomet – William Muir. పక్కన ఉన్న అంకె ఆ సంఖ్య పేజీలో నేను చెప్పినది కనబడుతుంది.
(నేను ఈ టపాలో వ్రాసినది చాలా మందికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు. నేను తప్పు వ్రాస్తున్నాని అనుకోవచ్చు. మరోసారి మనవి చేస్తున్నాను నేను వ్రాస్తున్నది పైన చెప్పిన పుస్తకం నుంచి. ఆ పుస్తకం వ్రాసినది William Muir. ఆ పుస్తకాని 1890లో వ్రాసాడు. ఆ పుస్తకాన్ని గూగులమ్మ ఉచితంగా అందిస్తుంది. నేను తప్పు చెబుతాననుకునేవాళ్ళు ఆ పుస్తకం చదువుకోగలరని ఆశిస్తూ……)
సశేషం.

6 comments:

amma odi said...

ఇస్లాం – కొన్ని నిజాలు గారూ,


నిజంగా మీ బ్లాగులో చాలా విలువైన సమాచారం ఉందండి. మహమ్మద్ ప్రవక్త గురించీ, వయో బేధం ఉన్న విధవ మహిళతో అతడి వివాహం గురించీ, ఇతర విశేషాలు కొన్ని ఇంతకు ముందే చదివి ఉన్నాను. కానీ మీ బ్లాగులో నాకు మరింత సమగ్రంగా తెలుసుకున్నట్లనిపించింది. నిజం చెప్పాల్సి వస్తే – ఇస్లాం మతస్థుల్లో చాలా మందికి, ముఖ్యంగా మనదేశంలో ఉన్న ముస్లింలకి అసలు తమ మతం ఏంచెబుతుందో, తమ ప్రవక్త జీవిత విశేషాలేమిటో, ఆకాశం నుండి రంజాన్ మాసంలో భూమికి దిగివచ్చిన తమ మత గ్రంధం ’ఖురాన్’లో ఏంవ్రాసి ఉందో తెలియదేమోనని నా అనుమానం. వాళ్ళకి తెలిసిందల్లా హిందూ మతాన్ని వ్యతిరేకించడం, ద్వేషించడమే ననుకుంటా.

ఇంకా చెప్పాల్సి వస్తే ఈ స్థితి మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా అంతేనేమో! ప్రపంచవ్యాప్తంగా ’ముస్లింలు’ తామున్న ప్రదేశంలో ఏది ప్రధాన మతమైతే, ఆ మతాన్ని వ్యతిరేకించడం, ద్వేషించడమే తమ మతంగా పాటిస్తారనుకొంటా. అంటే ఇండియాలో హిందూ మతాన్ని, టిబెట్,ఇండోనేషియా, చైనాలలో బౌద్ధమతాన్ని ..... మరో దేశంలో క్రైస్తవాన్ని ...... ఇలాగన్న మాట. ఇలా వ్యతిరేకించమనీ, ద్వేషించమనీ వాళ్ళ మత సంస్థలే చెబుతాయి.

ఇక – హఠాత్తుగా ఆవిర్భవించిన ఇజ్రాయేల్ దేశం, రాత్రికి రాత్రి దాన్ని గుర్తించిన బ్రిటన్, మొత్తం వ్యవహారంలో ప్రముఖ పాత్ర వహించిన అమెరికా, వీటన్నిటి వెనుకా మీరన్నట్లు మనకి అర్ధంకాని చాలా వ్యూహాలున్నాయి. ఇజ్రాయేల్ Vs పాలస్తీనా గొడవలు, West Asia Peace అన్నది మాత్రం – ప్రపంచ ప్రజల దృష్టిని నిరంతరం హైజాక్ చేయగల అంశం. ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో, మనకి తెలిసినవి కొన్నే. ఏమైనా గడిచిన చరిత్రలోనే కాదు, నడుస్తోన్న చరిత్రలో కూడా మనకి తెలిసింది కొంతే, తెలియాల్సింది కొండంత. ఏమంటారు?

ఇస్లాం - కొన్ని నిజాలు said...

thanks for expressing your views on my blog. but i see many people still unable to feel the truth.

even most of the muslims doesn't know the real life of mohammed. only 5% of the 200BIllion really knows and four in five whoever knows the truth is in power like he is a political leader or a religious leader.the last one person doesn't like this and tries to leave the religion. if he is in a muslim majority country, others will kill him, that is why we see many muslims trying to kill salman rashdie, taslima nasreen and film producers like theo van gough will be murdered in such a violent way.

కిట్టు said...

ఇస్లాం – కొన్ని నిజాలు గారూ,
నిజాలు ఎప్పుడూ వినటానికి కష్టంగానే ఉంటాయి. ప్రతీ మతంలోనూ అంతో, ఇంతో చెడు ఉంటుంది(మతం లో కాదు, మనిషి సృష్టించింది). కాని ఎక్కువ, తక్కువ వుంటాయిగా. ఇక్కడ కొందరు మీ అక్షరాలను జీర్ణం చేసుకోలేకపొతున్నారు. దానికి మీరేమి చేయలేరు. ఏది ఎమైనా మీరు ఎన్నో తెలియని విశయాలను, ఇంకెన్నో ఆసక్తికర విశయాలను వివరిస్తున్నందుకు మీకు కృతఙ్ఞతలు.

SHAIK. Arif said...

AMMA ODI గారు,

తమరికి బుర్ర ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదు, ఇస్లాం మతం అంటే హిందుస్ ని ద్వేషించడం అని తమరికి అర్ధం ఐంది.

ఇండియా లో ఉన్న ముస్లిమ్స్ కి Quran లో ఏముందో తెలీదా? ఏమిన రాసేపుడు కొంచెం బుర్ర తో రాయాలి, లేకపోతె మూసుకుని ఇంట్లో కూర్చోవాలి.

Unknown said...

అరే శంకర. జాతి గారు.... మీ ఒక్క మాట కూడ నిజం కాదు... మీ గ్రంధం లో ఉన్న విషయలు చదివి వాటి లో దూరిన మీ బుధ్ధి అలా మారి ఇస్లాం పై పడ్డారని అర్దం అయింది ..... మీకు హిదాయత ఇవ్వాలని సర్వ శక్తి మంతుడైన దైవాన్ని కోరుకుంటు.... సత్యమేవజయతే.......

Unknown said...

అరే శంకర. జాతి గారు.... మీ ఒక్క మాట కూడ నిజం కాదు... మీ గ్రంధం లో ఉన్న విషయలు చదివి వాటి లో దూరిన మీ బుధ్ధి అలా మారి ఇస్లాం పై పడ్డారని అర్దం అయింది ..... మీకు హిదాయత ఇవ్వాలని సర్వ శక్తి మంతుడైన దైవాన్ని కోరుకుంటు.... సత్యమేవజయతే.......