Thursday, January 22, 2009

పాలస్తీనా - దాని చరిత్ర

ఒక్కసారి మనం పాలస్తీనా గురించి దాని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. భౌగోళికంగా పాలస్తీనా ఇస్రాయేలు రెండూ కూడా కలిసిపోయి ఉంటాయి. దీని కన్నా ముందు మనం ఒక్కసారి కొంచెం చరిత్రలో వెనక్కు వెళ్ళి వద్దాం. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. మహమ్మదు ఇక్కడ ఉన్న ఆల్ అక్సా మసీదు నుండి స్వర్గానికి ఎగిరి వెళ్ళాడని ఖురానులోనూ, సిరాలోనూ, అనేక హాడిత్ లలో చెప్పబడియున్నది. (చారిత్రకంగా చూస్తే ఈ ఆల్ అక్సా మసీదు రెండవ క్యాలిఫు (Second Caliph) కట్టించాడు, జెరూసలేమును ముస్లిములు ముట్టడించేటప్పటికి మహమ్మదు చనిపోయాడు.) ఇందువల్ల జెరూసలెము ఈ మూడు మతాలవారికి కావలసిన పట్టణం.

ఇప్పుడు మతాలలో నుంచి చరిత్రలోకి వస్తే రెండవక్యాలిఫు జెరూసలెమును ఆక్రమించుకోకముందు అందులో క్రైస్తవులు, యూదులు ఉండేవారు. ఎప్పుడైతే ముస్లిములు ఆక్రమించుకొన్నారో ఇక అప్పటినుంచి యూరపులోని క్రైస్తవులు, ముస్లిముల మధ్య యుద్దాలు మొదలయ్యాయి. ఈ జెరూసలేము పట్టణం కొన్నాళ్ళు ముస్లిముల ఏలుబడిలో మరికొన్నాళ్ళు క్రైస్తవుల ఏలుబడిలో కొనసాగింది. ఈ పట్టణాన్ని ముస్లిములచెరనుండి కాపాడటానికి ఐరోపాలో క్రూసేడులు మొదలయ్యాయి. మొత్తం మీద ఇలా అందరూ కొట్టుకుంటూ పదమూడవశతాబ్దం వచ్చేసరికి ఇది ముస్లిములచేతిలో స్థిరపడిపోయింది. ఇన్ని యుద్దాలను తట్టుకోలేక అక్కడ ఉన్న యూదుప్రజలు కాస్త యుద్దాలు తక్కువగా ఉండే యూరపుకు తరలివెళ్ళిపోయారు.
మనం చరిత్రలో కాస్త ముందుకు వస్తే రెండవ ప్రపంచయుద్దంలో మనకు ఎంత మంది యూదులు ప్రాణాలు కొల్పోయారో తెలుసు.(సుమారుగా ఆరుమిలియనులమంది అంటే అరవైలక్షలమంది అని ఒక అంచనా. ప్రపంచచరిత్రలో ఇంతకన్నా భయంకరంగా ఒక వర్గానికి చెందిన ప్రజలను చంపడం ఇదే మొదటకాకపోయినా, ఇంతకన్నా ఎక్కువమంది చనిపోయినా యూదులకు వచ్చినంత పేరు మరింకెవ్వరికీ ఎందుకు రాలేదో నాకు తెలియదు.) రెండవ ప్రపంచయుద్దం ముగిసేసరికి యూదులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని అప్పటి అగ్రరాజ్యాలన్నీ(అందులో అమెరికా పాత్ర కాస్త ఎక్కువ అన్నమాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి) కలిసి నిర్ణయించాయి. ఇందుకు ఎక్కడ ప్రదేశం కోసం చూస్తుంటే, ప్రపంచంలో ఖాళీ ఎక్కడా లేనట్లు యూదులకు పుట్టినిల్లయిన జెరూసలేములో ఏర్పాటు చేసారు అదీ దానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిము దేశాలని తెలిసికూడా. దీనికి కొంత పక్కనే ఉన్న గాజాలో భూమిని కూడా ఇజ్రాయేలు అప్పుడప్పుడు తనలో కలిపేసుకుంటోంది. ఇది ఇప్పటిదాకా జరిగిన కధ.
ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్ని. ఇల్లు(ఇజ్రాయేలు) ఒకప్పడు యూదులకు చెందినది. తరువాత యుద్దాలను తట్టుకోలేక యూదులందరూ పక్కింటికి(యూరపుకు) వెళ్ళారు. ఇల్లు ఖాళీగా ఉందని పొరుగింటివాళ్ళు వచ్చికుదురుకున్నారు. సమయం రాగానే ఇంటియజమాని వచ్చాడు, గొడవ మొదలయ్యింది. ఇక్కడ మనం మఖ్యంగా చెప్పుకోవలసినది అప్పటి అమెరికాను. చుట్టుపక్కల అన్నీ ముస్లిము దేశాలే. ఎవ్వరూ అలా చేయడానికి ఒప్పుకోరు. కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, రష్యాలో చాలా ప్రజలు ఉండగలిగినదానికన్నా చాలా అధికస్థలం ఉన్నది. మళ్ళీ అక్కడ ఎవరూ శత్రువులు ఉండరు. కానీ ఇవి అన్నీ కాదని అంతమంది శత్రువుల మధ్యలో దేశాన్ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయేలు-పాలస్తీనాలో మొత్తం జనాభా కలిపితే కోటి మంది అనుకున్నా, ముస్లిములను ముస్లిము దేశాలు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు. పది దేశాలు పది లక్షలచొప్పున పంచుకుంటే చప్పున సమసిపోయే సమస్య ఇది. కానీ ఎవ్వరూ ఆలోచించరు. కనీసం యూదులకు రెండవప్రపంచ యుద్దంలో జరిగినది చూసిన తరువాత ముస్లిము దేశాలు కొంతమంది ముస్లిములను తమ దేశంలోకి రానిస్తే అస్సలు గొడవ ఉండదు. ఇజ్రాయేలు కూడా ముస్లిములను వారి మసీదును దర్శించుకనే, నిర్వహించుకునే అవకాశాలు వారికే ఇస్తే ఇవ్వాళ పాలస్తీనాలో ఎవ్వరూ చనిపోరు.
తమ భూభాగంలోకి ముస్లిములను ఏ ఇతరముస్లిము దేశాలు అంగీకరంచడంలేదు. ఇది తమ భూభాగమని ముస్లిముసంస్థలు తీవ్రవాద కార్యకలాపాలతో అమాయక ప్రజలను చంపుతారు. దీనికి ప్రతిగా ఇజ్రాయేలు(మనలాగా చేతగాని దేశం కాదు కాబట్టి) ఇలా అప్పుడప్పుడూ పక్క దేశాలకి షికారు వెళ్ళినట్లు దాడులు చేస్తుంది. ఇవి అన్నీ అగ్రరాజ్యాలు ఆడుతున్న కుట్రలు, దీనిలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం సామాన్యులు. వీటి గురించి వ్రాసి మనకు చేతులు నొప్పులు.

3 comments:

సమతలం said...

రెండవ ప్రపంచ యుద్ధం తరువత యూదులు ఇజ్రయెల్ కు వచ్చినారా? ప్రభుత్వాన్ని ఎలా ఎర్పాటు చేసారు? అంతకు ముందు ఎవరి ప్రభుత్వం ఉన్నది? వివరిస్తారా?

కాయ said...

good going... i want read about muhammed plz provide the other parts soon...

Unknown said...

hi i am Akbar.your aim is so good.
i want more information of Islam.
if you contacts me please your mail to my email id: akbar.mahammad@rediffmail.com.
please send your comets books in Telugu to my mail.
i am trusted you writing matters.

thank you brother.