Monday, January 19, 2009

మహమ్మదు జీవితం – రెండవ భాగం

(జరిగిన కథ: మహమ్మదు పుట్టకముందే తండ్రిని పోగొట్టుకుంటాడు. పుట్టిన తరువాత ఇద్దరు తల్లులు అతనికి పాలు ఇస్తారు. ఆరేళ్ళ వయస్సులో తల్లిని, ఎనిమిదేళ్ళ వయస్సులో తండ్రిలాంటి తాతను పోగొట్టుకుంటాడు. అతనికి అయిదేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి Fits of Epilepsy వస్తాయి. మహమ్మదును అతని పెదనాన్న పెంచుకుంటాడు. అతను పన్నెండేళ్ళవయస్సప్పుడు సిరియా వెళతాడు. ఇక చదవండి. మహమ్మదు యొక్క జీవితం రెండవ భాగం ఈ టపాలో వివరిస్తాను. పాత టపాను ఇక్కడ చూడవచ్చు.)
మహమ్మదు అలా సిరియా పర్యటనలో క్రైస్తవం గురించి మరియు యూదు మతం గురించి అనేక విషయాలు తెలుసుకుంటాడు. AD 580 నుండి 590 వరకు మహమ్మదు జీవితంలో చెప్పుకోదగ్గ విషయాలు లేవు. కాని ఈ సమయంలో మక్కాలో తెగల మధ్య యుద్దాలు బాగా జరిగాయి. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలు వయస్సు వచ్చాయి. అప్పుటికి అబూ తాలీబు కాస్త ముసలివాడయ్యాడు. అతని సంపాదన పెరగకపోగా ఇంటిలో ఖర్చులు మాత్రం పెరగసాగాయి. అప్పుడు తాలీబు మహమ్మదును ఖదీజా అనే బాగా ధనవంతమైన మహిళ వద్ద పనికి కుదిర్చాడు. మహమ్మదు ఖదీజాకు చెందిన ఒంటెలసమూహంతో మరొకసారి సిరియా పయనమవుతాడు. ఈ సారి మహమ్మదు సిరియా పర్యటన విజయవంతమవుతుంది. తన యజమానురాలికి బాగా లాభం చేకూర్చేలా అనేక భేరసారాలు మహమ్మదు చేస్తాడు.
సిరియా పర్యటన ముగిసిన తరువాత అందరికంటే ముందు వచ్చి తన యజమానురాలికి తన పర్యటన యొక్క పూర్తి వివరాలు తెలిపి మహమ్మదు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఖదీజా గురించి కొంచెం చెప్పుకోవాలి. ఖదీజా మహమ్మదు వలె ఖొరేషియా తెగకు చెందిన మహిళ. ఆమె వయస్సు నలభై సంవత్సరాలు. అప్పటికే ఇద్దరు మగవాళ్ళతో పెళ్ళయి వారు ఇద్దరూ చనిపోవడంతో ఆమె విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు పాత వివాహాల ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. పాతవివాహాల ద్వారా ఆమెకు చాలా సంపద కలిసివచ్చింది. ఇవి చూసి ఆమెకు అనేక మంది డబ్బున్న మగవాళ్ళు వివాహాన్ని ప్రతిపాదించినా ఆమె వారందరినీ తిరస్కరించి ఒంటరి విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెకు మహమ్మదు తారసపడ్డాడు. ఆమె అప్పుడు మహమ్మదు మీద మనస్స్ పడింది. (Muir Pg:22).
అప్పుడు ఆమె తన పనిమనిషి ద్వారా మహమ్మదును పెళ్ళాడాలనే తన మనస్సులోని మాటను మహమ్మదుకు చేరవేసింది. అందుకు మహమ్మదు అంగీకరించాడు. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలవయస్సున్నప్పుడు నలభై సంవత్సరాల వయసున్న ఖదిజాతో వివాహం జరిగింది. మహమ్మదుకు ఖదీజా ద్వారా ఇద్దరు మగపిల్లలు, నలుగురు అడపిల్లలు కలిగారు. మహమ్మదు తొలి బిడ్డ పేర్ ఖాసీం. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం మహమ్మదును అనేక సందర్భాలలో అబుల్ ఖాసీం (ఖాసీం యొక్క తండ్రి) అని సంబోదించడం మనం అనేక సురాలలో, ఖురానులో అనేక భాగాలలో గమనించవచ్చు. కానీ మహమ్మదుకు ఇక్కడ కూడా దురదృష్టం వదలలేదు. అతని మొదటి కొడుకు రెండు సంవత్సరాలలో చనిపోతే అతని ఆఖరి కొడుకు (ఖదీజా వలన కలిగిన) నెలలవయస్సులోనే చనిపోయాడు.
ఇవి కాక ఇంకా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరుగలేదు. మహమ్మదు జయీద్ అను పేరు గల ఒక బానిసను కొడుకుగా దత్తతచేసుకుంటాడు. తనను పెంచిన తాలీబు యొక్క కుమారుడైనటువంటి ఆలిని తెచ్చి పెంచుకుంటాడు.

Bibliography
Muir = Life of Mahomet – William Muir

2 comments:

క్రాంతి said...

చక్కని విషయాలు రాస్తున్నారు.అభినందనలు.

Anonymous said...

సాధారనంగా హిందూ,క్రైస్తవ మతాల గురించి తెలిసినంతగా ముస్లిం మతం గురించి జనానికి తెలియదు.మీది చాలా మంచి ప్రయత్నం.