Saturday, December 13, 2008

క్రైస్తవం – చరిత్రకు మరో పార్శ్వం

మొదట నేను యూదు మతం గురించి రాద్దామని అనుకున్నాను. కాని నాకు ఆ మతం మీద ఉన్న అవగాహన సరిపోదనిపించింది. నాకు యూదు మిత్రులు ఎవరు లేనందున మరియు ఇక్కడ ఇంతవరకు ఎవరు తటస్థించనందున నేను యూదు మతం మీద రాద్దామని అనుకున్న వ్యాసాన్ని కాస్త ప్రక్కన పెడుతున్నాను. ఇప్పుడు క్రైస్తవం గురించి వ్రాయదలచుకున్నాను. ఇస్లాం పుట్టుట మరియు అభివృద్ది చెందుటలో ఇది కూడా ఒక భాగం పోషించింది. అందువల్ల ముందు ఈ మతం గురించి అందరికీ కొన్ని తెలిసిన మరియు తెలియని విషయాలు చెప్పదలచుకున్నాను. నాకు తెలుసు, నన్ను ఒక పురుగును చూసినట్లు చూస్తారని మీరు ఈ post చదివాక. కాని ఇవన్నీ నిజాలేనని, ఇందువల్లనే క్రైస్తవం అంటే యూరపు మొత్తం మీద అందుకే చాలా అసహ్యం అని మీకే అర్ధం అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క para ఒక పుస్తకమంత అవుతుంది. కాని అవ్ చదవడానికి అందరికీ సమయముండదని సాధ్యమైనంత తక్కువగా వ్రాయడానికి ప్రయత్నించాను.

క్రైస్తవం క్రీస్తు పుట్టుకతో మొదలైనదని మన అందరికీ తెలుసు. అనేకమంది క్రైస్తవులు అనుకుంటునట్లు ఇది పూర్తిగా సొంతంగా అభివృద్ది చెందిన మతంకాదు మరియు పూర్తిగా మార్పులు, భేదాలు చూపించని మతంకాదు. ఈ మతంలో కూడా అనేక శాఖలున్నాయి. వాటిలో మనకు ప్రముఖంగా తెలిసినవి క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటులు. ఇవి కాక పోలిష్ చర్చి(polish church), మోర్మోనులు(mormons – అమెరికాలో ఉండేవారికి ఇది బాగా పరిచయం), రష్యన్ ఆర్థోడోక్స్(russian orthodox), జెహొవాహ్ విట్నెస్(Jehovah witness), ఆర్థోడోక్స్(orthodox), బాప్టిస్టులు(Baptists), ఎవాంజలికులు(Evangelics), ప్రెస్బిటేరియనులు(Presbytarian), రోమను క్యాథలిక్కులు(Roman Catholicism), ఈస్ట్రన్ రష్యన్ ఆర్థోడోక్స్(Eastern Orthodoxy), పెంటెకోస్టల్(Pentecoastals). ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి.

మొదట క్రైస్తవంలో ఉన్న ఇతర మత విషయాల గురించి చర్చించుకుందాం. క్రైస్తవం యూదు మతం నుండి ఉద్భవించింది. ఒక్క మాటలో యూదు మతం యొక్క మొదటి బిడ్డగా చెప్పవచ్చు. యూదు మతం నుండి మతగ్రంథాలను వీరు తీసుకున్నారు. ఆ మత గ్రంథాలతో పాటు, వారి దేవుళ్ళను, పండగలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. అప్పటి కాలంలో ఉన్న ఇతర మతాల నుంచి కూడా కొన్ని విషయాలను తీసుకున్నారు. ఉదాహరణకి కర్మ సిద్దాంతం, క్రిస్మస్ పండుగ, priests బ్రహ్మచారులుగా ఉండటం వంటివి, ఈస్టర్ పండుగ మొదలయినవి. ఇంతవరకు ఏమి తప్పులేదు. ఒక మతం అభివృద్ది చెందాలంటే కొన్ని మంచి విషయాలను ఇతరులనుంచి సంగ్రహించి ఒక గొప్ప మతాన్ని తయారుచేయడం తప్పులేదు, ఎందుకంటే దానివల్ల ప్రజలకు మంచి జరగవచ్చు కాబట్టి. కాని క్రైస్తవం అభివృద్దిలో మంచితో పాటు కొన్ని చెడు పద్దతులు కూడా పొందపరచిబడియుంది. క్రిస్మస్ పండుగ గురించి మరియు కొన్ని ఇతర చారిత్రక విషయాల గురించి తరువాత మాట్లాడుకుందాం.

యేసుక్రీస్తు జీవితచరిత్ర గురించి మనకందరికి తెలుసు, కబట్టి నేను అనవసరంగా తెలిసిన విషయాలు చెప్పి సమయం వృథాచేయను. మనకు తెలియకుండా దాచిపెట్టే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలొ కొన్నింటిని నేను ఇప్పుడు మీకు చెబుతాను. మరొరకంగా చెప్పలంటే క్రైస్తవం అనే నాణేనికి ఈ వ్యాసం మరోపార్శ్వం. క్రైస్తవం యూరపుమొత్తాన్ని దాదాపు పది సతాబ్దాలకు పైగా పాలించింది. ఈ కాలంలో ఉన్న రాజులు క్రైస్తవం అధికారమతంగా రాజ్యాన్ని పాలించేవారు లేకపోతే కొన్ని సార్లు స్వయంగా చర్చి పాలించేది. ఈ వెయ్యి సంవత్సరాల కాలాన్ని చీకటి రోజులుగా చరిత్రకారులు పిలుస్తారు ఎందుకంటే ఈ సమయంలో ఒక్క శాస్త్రసాంకేతిక వైద్య రంగాల్లో ఒక్క ఆవిష్కరణ గాని Arts, Sculptures గాని అభివృద్ది జరగలేదు. యూరపులోని దేశాలు అన్ని పూర్తిగా భారతదేశం, చైనా, పర్షియాలద్వారా జరిగే వర్తకం మీద పూర్తిగా ఆధారపడివున్నాయి. క్రైస్తవం తన బాల్యపు రోజులలో రోమను చక్రవర్తి మీద ఆధారపడి వుండేది. తరువాత రోమను సామ్రాజ్యానికి వ్యతిరేఖంగా యుద్దం చేసింది. ఇవికాక అనేక చారిత్రక విషయాలను క్రైస్తవులు మనకు కనబడకుండా ఉంచాలని ప్రయత్నిస్తారు. వాటిలో మచ్చుకు కొన్ని. స్పానిష్ ఇంక్విజిషన్(Spanish Inquisition), క్రూసేడులు (ఇందులో పిల్లల క్రూసేడు, ఆల్బిజినీశియన్ క్రూసేడు మిగతా వాటికన్నా కొంచెం భిన్నం), బానిసల ప్యాపారం(క్రైస్తవం దీని గురించి ఏమి చెప్పకున్నా, అనేక మంది బానిసలను చర్చి యొక్క తోటలలో పని చేయించడానికి తెచ్చేవారు), విచ్ హంట్(Withch Hunt), యూదులను చంపేటప్పుడు వారికి మద్దతివ్వకపోవడం వంటివి కొన్ని. వీటి గురించి క్రైస్తవులు ఎవరు మాట్లాడసాహసించరు. సరే మనం కూడా మాట్లాడకుండా ఉందాం. వీటిలో కొన్ని(తక్కువ మరణాలతో ముగిసినవాటిని చూద్దాం). ఇక మనదేశానికి వస్తే, క్యాథలిక్కు చర్చి పోర్చుగీసు వారికి సహాయం అందించుట, గోవా ఇంక్విజిషన్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా ఆర్యన్ ఇన్వేషన్ అంటూ చేసిన, చేస్తున్న అబద్దపు ప్రచారాలను గురించి తరువాత మాట్లాడుకుందాం.

యేసుక్రీస్తు అందరినీ మన్నించమన్నాడని చర్చి చెబుతోంది. చరిత్ర చూస్తే చర్చే యేసు మాటలకు వ్యతిరేఖంగా ఉన్నట్లు కనబడుతోంది. వారు మొదట రోమనుల సహాయంతో యూరపులో అభివృద్ది చెందారు. ౩వ శతాబ్దానికి చెందిన కోన్స్టాంటిన్(Constantine I) క్రైస్తవాన్ని రోము యొక్క అధికార మతంగా ప్రకటించాడు. క్రైస్తవాన్ని పాటించని వారిని తీవ్రంగా శిక్షించేవాడు. దీనివల్ల క్రైస్తవం బాగా అభివృద్ది చెందింది. అతని కొడుకు Constantinus II తిరిగి పాత మతమైన మిత్రాయిజంను అధికార మతంగా ప్రవేశపెట్టాడు. కాని పర్షియన్ల చేతిలో అతను పరాజయం పొందిన తరువాత రోములో క్రైస్తవానికి ఎదురులేక పొయింది. ఒకవేళ నిజంగా Constantinus II పూర్తికాలం పాలించినట్లయితే మిత్రాయిజం ఇప్పుడు యూరపు మొత్తానికి మతంగా ఉండేదని చరిత్రకారులు అందరూ అంగీకరించే సత్యం. కాని 5వ శతాబ్దం చివరికి క్రైస్తవం రోమును పూర్తిగా వశం చేసుకోగలిగింది. ఇక అక్కడి నుంచి యూరపు మొత్తానికి క్రైస్తవం పాకింది. 1AD నుంచి 150 AD వరకు మనం గమనిస్తే క్రైస్తవులను చంపేవారని మనకు కనబడుతోంది. కాని ఎందుకు చంపేవారో మాత్రం చరిత్రలో ఎక్కడా తెలుపలేదు. కొత్త మతాన్ని పాటిస్తున్నందుకు అని ఎవరైనా చెబితే అతను సగం నిజం మాత్రమే చెబుతున్నట్లు. ఎందుకంటే, అప్పటి రోములో యూదు మతం, రోమనులదేవతలను, గ్రీకు దేవతలను ఎక్కువగా పాటించేవారు. మిత్రాయిజం అప్పుడు బాగా ప్రచారంలో ఉన్న మరో మతం. ఇది పూర్తిగా పర్షియనుల మతం. శత్రువుల మతాన్ని అంగీకరించిన రోమనులు తమ దేశంలో పుట్టిన మతాన్ని, దాని పాటించేవారిని చంపేవారంటే ఎక్కడో ఏదో ఒక చిన్న చరిత్ర ముక్క అతకడంలేదని తెలుస్తోంది. 500AD నుంచి వెయ్యి సంవత్సరాలు క్రైస్తవం యూరపును పాలించినప్పుడు మనకు ఈ చరిత్ర అందకుండా తొలగించిఉంటారు. సరే, ఇక విషయానికి వస్తే రోము చక్రవర్తులు క్రైస్తవం అభివృద్దికి సహాయం చేశారు, కాని రెండువందల సంవత్సరాలలోపే రోము సామ్రాజ్యాన్ని చర్చి ఆక్రమించుకొన్నది. వారు అప్పుడు చాలా సంతోషించి ఉంటారు క్రీస్తును చంపినందుకు పగసాధించామని.

క్రైస్తవం యూదుమతం నుండి వచ్చిందని ముందు చెప్పుకున్నాం. యూదులవలననే క్రీస్తు చంపించబడ్డాడని క్రైస్తవులకు ఈ రోజుకు కూడా యూదులంటే కోపమే. చరిత్రమొత్తంలో వారు అవకాశం దొరికిన ప్రతీసారీ క్రైస్తవులు యూదులను చంపుతూనే వున్నారు. క్రూసేడులు ముస్లిములకు వ్యతిరేఖంగా మొదలయ్యి గ్రీకులను, యూదులని చంపి తరువాత ముస్లిముల మీదకు వెళ్ళేవారు. వేమనగారు మనకు చెప్పిన మాటలను ఇప్పుడు ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పదనం లేదు, అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు. వేమన గారు మానవులను ఉద్దేశించి అన్నారు, కానీ ఇక్కడ మనం ఒక గొప్ప మతం గురించి మాట్లాడుకుంటున్నాము. కాని క్రైస్తవులు మతగ్రంథాలను, చరిత్రను, చివరికి దేవుళ్ళను కూడా ఇచ్చిన మాతృమతమైన యూదుమతస్థులను చంపారు. హిట్లర్ పాలనలో యూదులకు ఏమి జరిగిందో మనకందరికీ తెలిసిందే. కాకపోతే అతను మతంపేరు మీద చేయకపోవడం పరవాలేదు. అప్పటి జర్మనీలో ఉన్న చర్చిలు, అప్పటి పోపు, చెప్పుకొదగ్గ సహాయం చేయలేదు. స్టాలిన్ కూడా ఎంతో మంది యూదులను చంపాడు. క్రైస్తవం తనకు అన్ని ఇచ్చినవారికి ఈ విధంగా ఋణం తీర్చుకుంటుంది.

ఇది క్రైస్తవం అంటే. నేను ఇస్లాం గురించి మొదలుపెట్టి క్రైస్తవం గురించి చెప్పడానికి ఒక కారణం వుంది. క్రైస్తవం నుంచి ఇస్లాం లోకి ఎన్నో ఆచారాలు వచ్చాయి. అవి అన్ని పూర్తిగా అర్థం కావాలంటే ముందు క్రైస్తవం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. క్రైస్తవం గురించి ఇంకా కొంచెం వ్రాయల్సినది వుంది. మిగతా తరువాయి భాగంలో.


(అడగగానే నాకు తన వ్యాసాన్ని వ్రాసుకోవడానికి అనుమతిచ్చిన నా మిత్రునికి Thanks. మనందరికీ క్రైస్తవం ఒక పార్శ్వం తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి తెలియని, తెలియనివ్వని రెండో పార్శ్వాన్ని మాత్రమే నేను అందరికీ చెప్పదలచుకున్నాను.)